అరుణాచల్ లోని ‘తవాంగ్’ పర్యాటక ప్రాంతం చూసొద్దామా..?

భారత్- చైనా మధ్య అందమైన ప్రదేశం గురించి తెలుసా..? తవాంగ్ పర్యాటక ప్రాంతం అందమైన మంచు పర్వతాలు, బౌద్ద విహారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చని ప్రకృతి అందాలు, మంచు పర్వతాలు, లోయలు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


ఆసియాలోనే అతిపెద్ద మఠం తవాంగ్ కూడా ఇక్కడే ఉంది. దాంతో ఈ నగరం బౌద్ధ విహారాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరిహద్దు ప్రాంత అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు.

భారత్- చైనా సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో పర్యటకుల తాకిడి పెరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారిందీ ప్రాంతం. తవాంగ్‌ పట్టణం భారత్‌- చైనా సరిహద్దు సమీపంలో ఉంది. అయితే భారత్, చైనా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు ఈ పట్టణానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తవాంగ్ లోని మొనాస్టరీని గోల్డెన్ నామ్‌ గ్యాల్ లాస్ అని కూడా పిలుస్తారు.

తవాంగ్ లోని మోనాస్టరీని గోల్డెన్ నామ్ గ్యాల్ లాస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ మోనాస్టరీ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత్ లోనే అతిపెద్ద మఠంగా పేరుంది. అలాగే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మఠంగా హోదాను కలిగి ఉంది. ఈ మోనాస్టరీ 400 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. మరోవైపు తవాంగ్ లో అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సులు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. తవాంగ్ లో సెలా పాస్, మాధురి లేక్, హార్ట్ లేక్, బంగా జంగ్ సరస్సు తదితర ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి.

తవాంగ్ పర్యాటక ప్రాంతానికి డైరెక్ట్ రైలు, విమాన సదుపాయాలు లేవు. తవాంగ్ కు సమీప విమానాశ్రయం అసోంలోని తేజ్ పూర్. ఇది సరిహద్దు ప్రాంతానికి 317 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడినుంచి తవాంగ్ కు చేరుకోవచ్చు. అలాగే గౌహతి విమానాశ్రయం తవాంగ్ నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో తవాంగ్ కు చేరుకోవచ్చు. ఇక అసోంలోని రంగపరా రైల్వేస్టేషన్.. తవాంగ్ కు 383 కిలోమీటర్ల దూరంలో ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.