అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే చీప్.. ఐఫోన్ 16 ప్లస్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సేల్ అవుతున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో అతిపెద్ద డిస్‌ప్లే కలిగిన ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.


ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్ సందర్బంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఫోన్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే దిగ్గజ ప్లాట్‌ఫామ్స్ కంటే తక్కువ ధరలో మరో ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 16 ప్లస్ ని అందిస్తోంది.

విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకగా దొరుకుతోంది. విజయ్ సేల్స్ కూడా రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించింది. ఇక్కడ ఐఫోన్ 16 ప్లస్ ఇతర ప్లాట్‌ఫామ్స్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో చిన్న డిస్కౌంట్ ఆఫర్స్ మాత్రమే ఉన్నాయి. ధరల విషయంలో విజయ్ సేల్స్ రెండింటినీ సులభంగా దాటేసింది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌ను రూ.89,900 లాంచ్ చేసింది. ఇప్పుడు విజయ్ సేల్స్‌లో కేవలం రూ.71,890 కు దొరుకుతోంది. కొనుగోలుదారులు తక్షణమే రూ.18,000 ఆదా చేస్తారు. ఈ ఆఫర్ ఫోన్‌ను చాలా సరసమైనదిగా మార్చింది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 16 ప్లస్ రూ.74,900 ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.79,900. అంటే విజయ్ సేల్స్‌లో ధర ఈ రెండింటి కంటే తక్కువగా ఉంది. కస్టమర్స్‌కు ఇక్కడే బెస్ట్ వ్యాల్యూ దొరుకుతుంది.

ఐఫోన్ 16 ప్లస్‌లో పెద్ద 6.7 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఇది బ్రైట్ OLED ప్యానెల్‌తో వస్తుంది. ఫాస్ట్ A18 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సాఫీగా పనిచేస్తాయి. ఆపిల్ ఈ ఐఫోన్‌కు అల్యూమినియం బాడీ ఇచ్చింది. IP68 రేటింగ్ ఉండడంతో ఈ ఫోన్ లో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. నీటిలో పడినా, దుమ్ములో పడినా ఫోన్ డ్యామేజ్ కాదు. రోజూ ఉపయోగించేవారికి చాలా సురక్షితం.

వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా స్పష్టమైన ఫోటోలిస్తుంది. 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సహాయపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కొనుగోలుదారులు 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఎంచుకోవచ్చు. ఫోన్ iOS 18తో మొదలవుతుంది. భవిష్యత్తులో iOS 26 వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. సంవత్సరాల పాటు వేగంగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లకు విజయ్ సేల్స్‌ చాలా నమ్మకమైన బ్రాండ్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ రిపబ్లిక్ డే ఆఫర్ పరిమిత కాలమే ఉండవచ్చు. త్వరగా చెక్ చేసి అతి తక్కువ ధరలో కొనండి. ఐఫోన్ 16 ప్లస్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. విజయ్ సేల్స్ ఈ ఫోన్‌ని మరింత బడ్జెట్‌ ధరలోకి తెచ్చింది. ఈ సారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లను స్కిప్ చేయండి. విజయ్ సేల్స్‌కు వెళ్లి భారీ సేవింగ్స్ పొందండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.