ఏకంగా 45 కేజీలు తగ్గిన మహిళ- ఈ 5 సింపుల్​ టిప్స్​ పాటిస్తే వెయిట్​ లాస్​.

బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్లు, జిమ్​లో గంటల తరబడి శ్రమించడం అని అనుకుంటారు. కానీ చిన్నపాటి

3. ప్రోటీన్ తోనే ఆకలిపై విజయం- బరువు తగ్గడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషించింది. కండరాల పుష్టికి, కొవ్వును కరిగించడానికి ప్రోటీన్ అవసరమని ఆమె నమ్ముతారు. రోజుకు కనీసం 100 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా అనిపించి, చిరుతిళ్లపై వ్యామోహం తగ్గుతుందని ఆమె తెలిపారు. ఇది చాలా సులభమైన పద్ధతి అని ఆమె వివరించారు.జీవనశైలి మార్పులతోనే, కేవలం 18 నెలల్లో 45 కేజీలు తగ్గిన హేలీ అనే మహిళ తన సక్సెస్ సీక్రెట్స్ పంచుకున్నారు. వాటిని ఇక్కడ చూసేయండి

బరువు తగ్గడం అనేది ఒక యుద్ధంలా అనిపిస్తుంటుంది. కఠినమైన డైట్​, ఒళ్లు హూనం చేసే వ్యాయామాలు చేస్తేనే ఫలితం ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ, నిలకడగా పాటించే చిన్నపాటి అలవాట్లే అద్భుతాలు చేస్తాయని ఓ మహిళ నిరూపించారు. కేవలం 18 నెలల్లో ఏకంగా 45 కిలోల బరువు తగ్గిన హేలీ, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన వెయిట్​ లాస్​ జర్నీని వివరించారు. కేవలం ఐదు అలవాట్లు తన జీవితాన్ని మార్చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా బరువు తగ్గాలని చూస్తుంటే, హేలీ చెప్పిన టిప్స్​ కచ్చితంగా ఉపయోగపడతాయి.


ఈ ఐదు అలవాట్లతో సులంభంగా బరువు తగ్గొచ్చు!

  1. నడకకు మించిన వ్యాయామం లేదు- వ్యాయామం అనగానే మనం ఏదో భారీగా ఊహించుకుంటాం. కానీ, నడక అన్నింటికంటే తక్కువ అంచనా వేసే వ్యాయామం అని హేలీ పేర్కొన్నారు. రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటునడవాలనిఆమె సూచిస్తున్నారు. “వీలైనంత వరకు ఆరుబయట, స్వచ్ఛమైన గాలిలో నడవడం వల్ల శారీరక కదలికలతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది,” అని ఆమె వివరించారు. నడకను మరింత ఆస్వాదించడానికి నచ్చిన పాడ్‌కాస్ట్ వినడం లేదా బరువున్న వెస్ట్ ధరించడం వంటివి చేయవచ్చని తెలిపారు.

2. నీరు తాగడం మర్చిపోకండి- తగినంత నీరు తాగడం తన జీవితాన్ని మార్చేసిన మలుపు అని హేలీ చెప్పారు. మన బరువులో సగానికి సమానమైన ఔన్సుల నీటిని ప్రతిరోజూ తాగాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు, 90 కిలోల బరువున్న వ్యక్తి సుమారు 3 లీటర్ల నీరు తాగాలి. “హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల అనవసరమైన ఆకలి తగ్గుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు,” అని ఆమె పేర్కొన్నారు. అదనపు శక్తి కోసం రోజుకు ఒకసారి ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం కూడా ఆమె అలవాటు.

3. ప్రోటీన్ తోనే ఆకలిపై విజయం- బరువు తగ్గడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషించింది. కండరాల పుష్టికి, కొవ్వును కరిగించడానికి ప్రోటీన్ అవసరమని ఆమె నమ్ముతారు. రోజుకు కనీసం 100 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా అనిపించి, చిరుతిళ్లపై వ్యామోహం తగ్గుతుందని ఆమె తెలిపారు. ఇది చాలా సులభమైన పద్ధతి అని ఆమె వివరించారు.

4. ప్రశాంతమైన ఉదయం- ఉదయాన్ని ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, వ్యాయామం లేదా మరేదైనా పనిపై దృష్టి పెట్టాలి. అయితే, “నిద్రలేచిన మొదటి 30 నిమిషాల పాటు ఫోన్ ముట్టుకోకూడదు,” అనేది ఆమె గట్టిగా పాటించే నియమం. కేవలం రెండు వారాల పాటు ఇలా చేసి చూడండి, మీలో ఒత్తిడి తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుందని, మానసిక స్పష్టత వస్తుందని ఆమె హామీ ఇస్తున్నారు.

5. పీచు పదార్థం (ఫైబప్​) తప్పనిసరి- జీర్ణక్రియ మెరుగుపడటానికి, కార్బోహైడ్రేట్లను సులభంగా ప్రాసెస్ చేయడానికి ఫైబర్ ఎంతో అవసరం. “రోజుకు మూడు రకాల కూరగాయలు తీసుకోవడం” అనే సింపుల్ రూల్‌ను ఆమె పాటిస్తారు. ఇది కడుపు నిండుగా ఉండేలా చేయడమే కాకుండా, బరువు పెరిగిపోతామేమో అన్న భయాన్ని పోగొడుతుందని హేలీ చిరునవ్వుతో చెబుతున్నారు.

ఈ చిన్న మార్పులు ఒకే రోజులో ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నిలకడగా పాటిస్తే ఆరోగ్యకరమైన మార్పు ఖాయమని ఆమె ప్రయాణం నిరూపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.