కొత్త కారు కొనడం మంచిదా? సెకండ్ హ్యాండ్ కారు చాలా?

 సొంత కారు (Car) అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కల నిజం చేసుకునే సమయం వచ్చినప్పుడు.. అందరి మైండ్‌లో కొత్త కారు (New car) కొనాలా?


లేదా తక్కువ రేటులో వచ్చే సెకండ్ హ్యాండ్ కారు (Second hand car) చాలా? అనే ప్రశ్న మెదులుతుంది. ఈ నిర్ణయం మీ ఆర్థిక పరిస్థితిని, రాబోయే కొన్నేళ్ల మీ ప్లానింగ్‌ని డిసైడ్ చేస్తుంది. అందుకే, ఈ కన్ఫ్యూజన్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసి, మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం.

కొత్త కారు లుక్ అదిరిపోద్ది కానీ..
కొత్త కారు అనగానే అదో తెలియని ‘కిక్కు’ ఉంటుంది. షోరూమ్ నుంచి బండి బయటకు తీస్తుంటే వచ్చే ఫీలింగే వేరు. కొత్త కారు కొంటే వచ్చే ప్రధాన లాభం.. మానసిక ప్రశాంతత. కంపెనీ ఇచ్చే వారంటీ (Warranty) ఉండటంతో.. కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు రిపేర్ల గొడవ ఉండదు. ఇంజన్ ఆయిల్ మార్చుకుంటే చాలు, బండి స్మూత్‌గా సాగిపోతుంది. టెక్నాలజీ విషయానికి వస్తే.. లేటెస్ట్ ఫీచర్స్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్, అదిరిపోయే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మంచి మైలేజ్.. ఇవన్నీ కొత్త కార్లలోనే లభిస్తాయి. సేఫ్టీ విషయంలో రాజీపడకూడదు అనుకునేవారికి కొత్త కారే కరెక్ట్ ఛాయిస్.

అసలు ట్విస్ట్
కొత్త కారు ఎంత బాగున్నా.. ఆర్థిక భారం పడే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. మీరు కారు కొని షోరూమ్ గేటు దాటించారో లేదో.. దాని విలువ అమాంతం పడిపోతుంది. మొదటి ఏడాదిలోనే కారు విలువ సుమారు 10-20 శాతం తగ్గిపోతుంది. అంటే మీరు బండిని వాడినా, వాడకపోయినా మీ డబ్బు ఆవిరైపోతుందన్నమాట. దీనికి తోడు కొత్త కారుకి ఇన్సూరెన్స్ ప్రీమియం, రిజిస్ట్రేషన్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.

సెకండ్ హ్యాండ్ కారు
వాడిన కారు (Used Car) కొనడం వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏంటంటే డబ్బు ఆదా అవుతుంది. కొత్త కారు మీద పడే ఆ భారీ ‘డిప్రిసియేషన్’ దెబ్బ మీకు తగలదు. మొదటి ఓనర్ ఆల్రెడీ ఆ నష్టాన్ని భరించాడు కాబట్టి, మీకు తక్కువ రేటుకే మంచి కారు లభిస్తుంది. ఉదాహరణకు, ఒక కొత్త చిన్న కారు వచ్చే బడ్జెట్‌లో.. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కాస్త పెద్ద సెగ్మెంట్ కారు అంటే సెడాన్ or SUV కొనుక్కోవచ్చు. ఇన్సూరెన్స్, టాక్స్‌ల విషయంలోనూ చాలా సేవ్ అవుతుంది.

పాత కారు కొనడంలో ఉన్న ఒకే ఒక్క రిస్క్.. దాని కండిషన్. వారంటీ ఉండదు కాబట్టి, రేపు ఏదైనా రిపేర్ వస్తే మీ జేబు నుంచే పెట్టుకోవాలి. సరిగ్గా మెయింటైన్ చేయని కారు కొంటే.. అది మిమ్మల్ని షెడ్డు చుట్టూ తిప్పిస్తుంది. అందుకే, సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు దాని సర్వీస్ హిస్టరీ (Service History) పక్కాగా చెక్ చేయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చూస్తే.. ఆ కారుకి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా అనేది తెలిసిపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. నమ్మకం ఉన్న మెకానిక్‌తో టెస్ట్ డ్రైవ్ చేయించకుండా అస్సలు కొనొద్దు.

మరి ఏది కొనాలి?
అందరికీ ఒకే రూల్ సెట్ అవ్వదు, ఇది పూర్తిగా మీ లైఫ్‌స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత ముఖ్యం అనుకుంటే, రిపేర్ల టెన్షన్ అస్సలు వద్దు అనుకున్నా.. లేదా లేటెస్ట్ ఫీచర్స్, సేఫ్టీ టెక్నాలజీ కావాలనుకున్నా ‘కొత్త కారు’ కొనాలి. అంతేకాదు కారును కనీసం 7-10 ఏళ్ల పాటు వాడే ప్లాన్ ఉండి, నెలవారీ EMIs కట్టే స్థోమత ఉంటే కొత్త బండి బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా బడ్జెట్ టైట్‌గా ఉండి, తక్కువలో పని అయిపోవాలి అనుకుంటే ‘సెకండ్ హ్యాండ్’ బండిని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ డబ్బుతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న పెద్ద కారు నడపాలి అనుకున్నా, కారు విలువ పడిపోవడం (Depreciation) వల్ల డబ్బు నష్టపోకూడదు అనుకున్నా సెకండ్ హ్యాండ్ కారు కొనడమే కరెక్ట్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.