విశాఖ ఉత్సవ్‌కు నేడు శ్రీకారం.. ఏయే కార్యక్రమాలు ఉంటాయో తెలుసా?

విశాఖ ఉత్సవ్‌కు నేడు శ్రీకారం చుడుతున్నారు.


ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు కార్యక్రమాలు ఉంటాయి. విశాఖ, అనకాపల్లి, అరకులోయల్లో ఒకేసారి నిర్వహిస్తారు. అరకులో జనవరి 30, 31, ఫిబ్రవరి 1న.. అనకాపల్లిలో ఈ నెల 25, 26న ఉత్సవ్‌ ఉంటుంది. నగరంలోని ఐదు బీచ్‌లలో రోజూ సంబరాలు జరుపుతారు.

నేడు పర్యాటకశాఖ మంత్రి కందుల దర్గేశ్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తారు. ఉత్సవ్‌కు సంబంధించిన అన్ని అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష జరుపుతారు. సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో జ్యోతి వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

శాస్త్రీయ నృత్యం, అరకు ధింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రదర్శన ఉంటాయి. ఆర్కే బీచ్‌తో పాటు సాగర్‌నగర్‌, రుషికొండ, మంగమారిపేట, భీమిలీ బీచ్‌లల్లో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ కార్యక్రమాలు జరుపుతారు.

ఫ్లవర్ షో , మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్,వైజాగ్ కల్చర్ టాలెంట్స్, రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, ఫుడ్ కోర్టులు, షాపింగ్ స్టాళ్లు. డ్రోన్ షో, బీచ్ గేమ్స్, బీచ్ రెస్టారెంట్, అడ్వంచర్ స్పోర్ట్స్, బోటు రేసింగ్, స్పీడ్ బోటింగ్, కయాకింగ్, పారామోటరింగ్, కార్నివాల్ వాక్, టెంపుల్ రెప్లిక, వంటల పోటీలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

అటవీ ప్రాంతంలో సైక్లింగ్ పోటీలు, ఫ్లోరీకల్చర్, అమ్యూజ్మెంట్ రైడ్స్, ఫుడ్ కోర్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్, కాఫీ ఫెస్టివల్, టాలీవుడ్ నటుల ప్రదర్శనలు, అరకు వ్యాలీ రైడ్స్, కార్నివాల్ వాక్, ట్రైబల్ పెర్ఫామెన్స్, అనంతగిరి, గాలికొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, పారా మోటరింగ్ వంటివి ఎర్పాటు చేస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.