మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. ఇప్పుడు కొత్త తరహాలో

Maruti Suzuki కంపెనీ నుంచి ఏ కారు మార్కెట్లోకి వచ్చినా కూడా దానిని వెంటనే కొనుగోలు చూస్తారు. అయితే వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్లను అప్డేట్ చేస్తూ ప్రవేశ పెడుతుంటారు. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చే కార్లు ఏవైనా మైలేజ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని చాలామంది నమ్మకం. అందుకే మైలేజ్ కోరుకునే వారు ఈ కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ సైతం లేటెస్ట్ గా ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఓ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది లీటర్ ఇంధనానికి 55 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన డిజైన్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కూడా ఉండడంతో దీనిపై చాలామంది మనసు పెడుతున్నారు. ఇంతకీ ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళితే..


Maruti Suzuki కొత్తగా హైబ్రిడ్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి ఉన్న వ్యాగన్ఆర్ ను డెవలప్ చేసి నేటి తరానికి అనుగుణంగా మార్చింది. దీనికి Fex Fuel అనే పేరుతో ఉన్న ఈ వ్యాగన్ఆర్ కారులో హైబ్రిడ్ ఇంజన్ ను అమర్చారు. ఇందులో 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. అయితే పెట్రోల్ తో పాటు 20 శాతం వరకు ఇథనాల్ కూడా పనిచేస్తుంది. రెండు ఇంజన్లు కలిపి 80 శాతం వరకు కర్బన ఉధ్గారాలను తగ్గిస్తాయి. అలాగే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సెన్సార్ పైపులు ఉండడంతో ఎలాంటి కాలుష్యం బయటికి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
ఈ ఇంజన్ పై స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

ఈ కారులో రోజువారి ఉపయోగానికి అనుగుణంగా స్మార్ట్ ఫీచర్లను అమర్చారు. టచ్ స్క్రీన్ ఇన్ఫో టైం మేట్ సిస్టం, పవర్ విండోస్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్,

ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే 17.78 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ తో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ, యుఎస్బి పోర్టు వంటి ఫీచర్లో ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, పవర్ విండోస్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సెంట్రల్ లాకింగ్ వంటివి ఉన్నాయి. అలాగే డ్రైవర్ డిజిటల్ డిస్ప్లే కూడా అనుభూతిని అందిస్తుంది. ఈ వ్యాగన్ఆర్ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. EBD తో కూడిన ABS, సీట్ బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటివి రక్షణ ఇస్తాయి. వ్యాగన్ఆర్ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఉన్నా కూడా దీని ధర ఏమాత్రం పెంచలేదని తెలుస్తోంది దీనిని రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.