భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్ గా ఈ భారత్ ఫైబర్ స్పార్క్ ప్లాన్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ యూజర్ కి కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ లను చవక ధరలో అందించడానికి ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఈ కొత్త స్పార్క్ ప్లాన్ తో వినియోగదారులు కేవలం రూ. 399 (పన్నులు అదనం) ఖర్చుతో ప్రతి నెలా సుమారు 3,300 GB (3.3 TB) ఆఫర్ చేస్తుంది. చవక ధరలో అధిక డేటా వినియోగం కోరుకునే యూజర్లు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అందుకే, ఈ బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ లేటెస్ట్ బెస్ట్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకోండి.
BSNL Spark Plan: ఏమిటి ప్లాన్?
ఇది బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్ గా అందించిన బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ మరియు ఇది మొదటి 12 నెలలకు అమలు అయ్యే ఇంట్రో ఆఫర్ గా ప్రకటించబడింది. అంటే, ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లకు మొదటి సంవత్సరం మొత్తం నెలకు కేవలం రూ . 399 (టాక్స్ అదనం) రూపాయల చవక ధరలో లభిస్తుంది. తర్వాత ఇదే ప్లాన్ ధర నెలకు రూ. 449 రూపాయలు గా మారుతుంది. అయితే, ఇది మొదటి సంవత్సరం ఆఫర్ తో బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ గా నిలుస్తుంది.
BSNL Spark Plan: అందించే బెనిఫిట్స్ ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ లేదా ప్లాన్ గొప్ప డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 50 Mbps వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు టోటల్ 3,300 GB (3.3 TB) డేటా ఆఫర్ చేస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 4Mbps వేగంతో నెల మొత్తం అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తో పాటు నెల మొత్తం అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ సర్వీస్ తో బిఎస్ఎన్ఎల్ యొక్క స్మార్ట్ కస్టమర్ సపోర్ట్ అండ్ ఇంటెలిజెంట్ సెటప్ కూడా లభిస్తుంది.
మంచి ఇంటర్నెట్ స్పీడ్, నెల మొత్తం సరిపోయే భారీ డేటా మరియు పోటీ ధరకు అందుబాటులో ఉండటం వల్ల ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా చాలా విలువైన ప్లాన్ గా నిలుస్తుంది.


































