నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లి వచ్చే ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (పశ్చిమబెంగాల్‌) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ (16523) కొత్త రైలు ప్రతి బుధవారం 10.15 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు నుంచి ప్రారంభమై నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు,

రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌, అనకాపల్లి, దువ్వాడ(Anakapalli, Duvvada), పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, బరంపూర్‌ నుంచి బాలూర్‌ఘాట్‌ చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి శనివారం బాలూర్‌ఘాట్‌-ఎస్‌ఎంవిటీ బెంగుళూరు (16524)బయలుదేరి సోమవారం ఉదయం 3.00 గంటలకు బెంగుళూరు(Bengaluru)కు చేరుకుంటుందన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.