మారుతి సుజుకి e-విటారా VS టయోటా ఇబెల్లా:543km

మారుతి సుజుకి e-విటారా మరియు టయోటా ఇబెల్లా భారతీయ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో కొత్త పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేయబడ్డాయి.


కానీ బ్రాండ్ గుర్తింపు, డిజైన్,ఫీచర్స్ మార్కెటింగ్ విధానంలో ప్రత్యేకతలు చూపిస్తున్నాయి. e-విటారా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా రూపొందించగా, ఇబెల్లా టయోటా నమ్మకాన్ని , ప్రీమియం ఫీచర్లను అందించే విధంగా రూపొందించింది. రెండు మోడల్స్ కూడా సుమారు 543 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయని కంపెనీలు ప్రకటించాయి. భారతీయ వినియోగదారుల కోసం ఇవి పట్టణ ప్రయాణాలకు, కుటుంబ అవసరాలకు,దూర ప్రయాణాలతో పాటు పర్యావరణహిత డ్రైవింగ్‌కు సరైన ఎంపికలుగా నిలుస్తాయి.
మారుతి సుజుకి e-విటారా
మారుతి సుజుకి e-విటారా ఎలక్ట్రిక్ SUV. ఇది అధిక సామర్థ్యం గల లిథియం-అయాన్ eGRID బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ 543 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీ -30°C నుండి 60°C వరకు పనిచేయగలదు . ప్రత్యేక థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండడం వలన స్థిరమైన పనితీరును కలిగి ఉంటుంది షిఫ్ట్ -బై -వైర్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంటుంది.

ఫీచర్స్
26.04 cm మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ,డిజిటల్ కాక్ పిట్,ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్,సన్ రూఫ్ విత్ ఫిక్స్డ్ గ్లాస్,వైర్ లెస్ చార్జర్, లాంగ్ వీల్ బేస్,మంచి బూట్ స్పేస్,స్మార్ట్ వాచ్ కనెక్ట్ ,సుజికి నావిగేషన్,ఛార్జింగ్ షెడ్యూల్,వెహికల్ స్టేటస్ & అలర్ట్స్, స్లైడింగ్ & రిక్లైనింగ్ రియర్ సీట్స్,వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి.

ADAS Level 2 సాంకేతికతతో 15 కంటే ఎక్కువ ఫీచర్లు అందించబడ్డాయి. వీటిలో లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్,7 ఎయిర్ బాగ్స్ ఉంటాయి .రియర్ వ్యూ కెమెరా ,పార్కింగ్ సెన్సార్లు ,హై బీమ్ అసిస్ట్,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం ఉంటాయి.

3D అప్పీరియన్సు,మ్యాట్రిక్స్ రియర్ లాంప్స్, మ్యాట్రిక్స్ LED DRLS,R18 ఏరియో డైనమిక్ అలోయ్ ఉంటాయి.దీనిలో మూడు మోడ్స్ ఎకో,నార్మల్,స్పోర్ట్స్ ఉంటాయి.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా
టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా టయోటా నుండి వచ్చిన తోలి ఎలక్ట్రిక్ SUV. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో 49 kWh, 61 kWh వస్తుంది. 49 kWh వేరియంట్ ఫుల్ ఛార్జ్ 440 కిలోమీటర్ల రేంజ్, 61 kWh వేరియంట్ 543 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయి.

49 kWh వేరియంట్ లో 106 kW, 61 kWh వేరియంట్ లో 128 kW శక్తివంతమైన మోటార్లు ఉంటాయి.189 Nm టార్క్ ను అందిస్తాయి. షిఫ్ట్ -బై -వైర్ తో వస్తుంది.DC ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 45 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది.

ఫీచర్స్
డిజిటల్ కాక్‌పిట్, 10.1 ఇంచ్ ఆడియో డిస్ప్లే యూనిట్, అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.Connect సిస్టమ్ స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, రిమోట్ కమాండ్స్, నావిగేషన్, ఛార్జింగ్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ADAS Level 2 సాంకేతికతతో వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ప్రీ-కోలిజన్ సిస్టమ్ 7 SRS ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా అందుబాటులో ఉన్నాయి.Eco, Normal, Sport, Snow అనే నాలుగు మోడ్‌లు ఉన్నాయి.
టోటల్ గా e-విటారా శక్తివంతమైన బ్యాటరీ, అధిక రేంజ్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లగ్జరీ ఇంటీరియర్‌తో భారతీయ వినియోగదారులకు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఎంపికగా నిలుస్తోంది. టయోటా అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా అధిక రేంజ్, శక్తివంతమైన మోటార్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్‌తో భారతీయ వినియోగదారులకు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV ఎంపికగా నిలుస్తోంది.మన డ్రైవింగ్ విధానం,అభిరుచులకు అనుగుణంగా రెండింటిలో ఎంపిక చేసుకోవచ్చు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.