మిల్కీ బ్యూటీ తమన్నా.. సీక్రెట్‌ ఫేస్‌మాస్క్‌ ఎంటో తెలుసా?

ఈ చలివేళ ముఖం పొడిబారడం.. జీవం లేకుండా కోల్పోవడం వంటి చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి. రాను రాను పరిస్థితి మరింత దారుణంగా మారి ముఖం జీవం లేకుండా కూడా అయిపోతుంది. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా ఫేస్ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. హీరోయిన్ కాంతివంతమైన ముఖం కోసం తమన్నా ఫాలో అయ్యే రెమెడీని కూడా చూపించింది. ఆ సీక్రెట్ తో మీరు కూడా మిల్కీ బ్యూటీ లాగా మెరిసిపోవచ్చు.


మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటి, ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్పిన బ్యూటీ సీక్రెట్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో ఆమె ఫేస్ మాస్క్ తయారు చేసుకుంటుంది. శనగపిండి, రోజ్‌వాటర్‌, పెరుగు కలిపి తయారు చేసింది. ఈ పదార్థాలతో కాంతివంతమైన ముఖం మెరిసిపోతుంది. ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా మాస్క్ తయారు చేసుకోవచ్చు. చలికాలంలో మీ జీవం లేని ముఖానికి జీవం వస్తుంది. అంతేకాదు ముఖం పొడిబారకుండా ఉంటుంది.

నటి తమన్నా పెరుగు, శనగపిండితో కలిపిన ఫేస్ మాస్క్ ద్వారా మీ చర్మానికి హైడ్రేషన్ అందుతుంది. మాయిశ్చరైజర్ లభిస్తుంది, యూట్యూబ్ వీడియోలో ఆమె షేర్ చేసుకున్న ఈ ఫేస్ మాస్క్ తో మీ చర్మం మెరిసిపోతుంది. సాధారణంగా భారతీయ మహిళలు శనగపిండితో స్క్రబ్ చేసుకుంటారు. తద్వారా ముఖ రంధ్రాలు తొలగిపోతాయి, డెడ్‌ స్కిన్ సెల్స్ కూడా మాయమైపోతాయి. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు కూడా ఉంటాయి. ఇక రోజ్‌ వాటర్‌ విషయానికి వస్తే ఇది మంచి టోనర్ల ఉపయోగపడుతుంది. స్కిన్‌ పీహెచ్ స్థాయిలను సమతులానికి కూడా సహాయపడుతుంది.

రెండు చెంచాల శనగ పిండి ఒక చెంచా పెరుగు కొన్ని చుక్కల రోజ్ వాటర్ తీసుకొని ఈ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు . ఈ రెండిటిని ఈ మూడిటిని బాగా కలిపి స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖం మెడ భాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చర్మం మంచి హైడ్రేషన్‌తోపాటు మాయిశ్చర్ కూడా అందిస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ రెమెడీ ప్రయత్నించవచ్చు

తమన్నా భాటియా ఈ ఫేస్ మాస్ తో మీ ముఖం కాంతివంతంగా చలికాలంలో కూడా మెరుస్తుంది. అయితే ఈ ఫేస్ మాస్క్ మీరు ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అలర్జీ బారిన పడితే వాడకుండా ఉండటమే బెట్టర్‌. అయితే ఇదివరకు తమన్నా కాఫీ తేనెతో కలిపి ఎక్స్‌ఫోలియేషన్‌ స్క్రబ్ కూడా తయారు చేసి యూట్యూబ్ వేదికగా షేర్ చేశారు. ఇది కూడా చలికాలంలో మంచి గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.