దీనితో కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో 32 ఇంచ్ QLED Smart Tv ని అందించగలిగింది. బ్లౌపంక్ట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Blaupunkt (32) QLED Smart Tv : ప్రైస్
బ్లౌపంక్ట్ ఈ లేటెస్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 9,699 బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ జనవరి 22వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ చివరి రోజు సలికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మంచి బ్యాంక్ ఆఫర్స్ తో కూడా లభిస్తుంది.
Also Read: OPPO A6 5G: బేసిక్ 5జి ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Blaupunkt (32) QLED Smart Tv : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు HDR సపోర్ట్‌తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ కలిగిన బెజెల్ లెస్ డిజైన్ తో స్టైలిష్ లుక్ మరియు పెద్ద స్క్రీన్ అనుభూతి మీకు ఇస్తుంది. ఇది Amlogic క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 1 జీబీ ర్యామ్ అండ్ 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది Jio Tele OS తో నడుస్తుంది మరియు అన్ని ఇండియన్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 48W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ బాస్ ట్యూబ్ స్పీకర్లు కలిగి మంచి బాస్ సౌండ్ అందిస్తుందని కూడా బ్లౌపంక్ట్ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, USB, HDMI, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400+ ఉచిత లైవ్ ఛానల్స్ కూడా అందిస్తుంది.

































