ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాదిలో ఆపిల్పేను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆపిల్ తన చెల్లింపు గేట్‌వే యాక్సెస్ కోసం కార్డ్ జారీదారులతో ఫీజు నిర్మాణాలపై చర్చలు జరుపుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపిల్ పే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 89 మార్కెట్లలో అందుబాటులో ఉన్న యాపిల్, పేమెంట్ గేట్‌వే యాక్సెస్ కోసం కార్డు జారీదారులతో ఫీజ్ స్ట్రక్చర్ విధానంపై చర్చలు జరుపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.
దశల వారీగా ఆపిల్ పే ప్రారంభం!
Apple Pay ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో Apple Pay సేవలను దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో కార్డ్ బేస్డ్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ దృష్టి పెట్టనుంది. ఆ తర్వాత దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)తో అనుసంధానం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం వివిధ రకాల నియంత్రణ అనుమతులు అవసరం కావచ్చని పేర్కొన్నారు.
ప్రారంభ దశలో Apple Pay UPI కోసం TPAP (థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి, ఎందుకంటే ఆమోద ప్రక్రియలో ప్రత్యేకమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ , కార్డ్ బేస్డ్ సిస్టమ్‌ల నుండి ప్రాథమికంగా భిన్నమైన చెల్లింపుల నిర్మాణం ఉంటుంది..
అసలేంటి ఆపిల్ పే? ఎలా పనిచేస్తుంది?
ఆపిల్ పే అనేది ఆపిల్ అనుబంధ సంస్థ అయిన ఆపిల్ పేమెంట్స్ సర్వీసెస్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. ఆపిల్ పే ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ , డెబిట్ కార్డులను ఆపిల్ వాలెట్లో స్టోర్ చేయడానికి , వారి ఆపిల్ డివైజ్‌లను ఆన్ పాయింట్ ఆఫ్ సేల్ (PoS) వద్ద NFCతో ట్యాప్ చేయడం ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేయవచ్చు.
ప్రస్తుతానికి, ఇండియన్ కార్డ్స్ ఆపిల్ వాలెట్‌తో అనుకూలంగా లేవు. భారతదేశంలో కంపెనీగా తమ ఉనికి పెరుగుతోందని భావించిన ఆపిల్, దానిని సద్వినియోగం చేసుకోవడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే ఆపిల్ పే కు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.


































