చివరిగా అహింస అనే చేశారు. కాగా ప్రస్తుతం ల స్పీడ్ తగ్గించారు తేజ. ఇదిలా ఉంటే గతంలో తేజ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నితిన్ హీరోగా నటించిన ధైర్యం నిర్మాణ సమయంలో నిర్మాత సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకుని ఎడిటింగ్ మార్చిన సంఘటనపై తేజ మాట్లాడారు. పరిశ్రమలో విశ్వాసం తక్కువ అని, అలాంటి పరిస్థితులకు దర్శకుడిగా తానే బాధ్యత వహిస్తానని అన్నారు తేజ.
అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఇండస్ట్రీగా అభివర్ణించిన తేజ. ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని అన్నారు. ఆయన విడాకుల కేసులో తాను మధ్యవర్తిత్వం వహించానని వచ్చిన వార్తలను ఖండించారు. పరిశ్రమలో సన్నిహితమైన వ్యక్తులు ఇప్పుడు ఎవరూ లేరని, సమస్యలు వస్తే తాను ఎవరినీ సహాయం అడగనని తేజ అన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ.. బయట కఠినంగా కనిపించినా ఇంట్లో కూడా అలాగే ఉంటానని, పెద్దగా నటించనని, పుస్తకాలు చదువుకుంటూ గడుపుతానని తేజ అన్నారు. తన పిల్లలు తన లను విమర్శిస్తారని, హోరా హోరీ చెత్తగా ఉందని తన కొడుకు చెప్పాడని, అయితే నిజం ను మాత్రం ఇష్టపడ్డారని తెలిపారు. మూస ధోరణిలో లు తీయడంపై తనకు ఆసక్తి లేదని, 70-80 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ తీయాలని యోచిస్తున్నట్లు, దానికి స్టార్ హీరోలు లభించడం కష్టమని, బహుశా డల్ పీరియడ్‌లో ఉన్న నటులు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ శేఖర్ గారితో కూడా చేయాలనే ప్లాన్ ఉందని తేజ తెలిపారు.



































