దీంతోపాటు IP64 రేటింగ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ టెక్నో ఫోన్ ఇవాళ్టి నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఇవాళ్టి నుంచే సేల్ :
టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఇవాళ మధ్యా్హ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. గెలాక్సీ బ్లూ, టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్, ఆరోరా పర్పుల్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
HD+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 OS :
టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్ఫోన్ 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. Unisoc T7250 SoC చిప్సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది.
5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ లైట్ :
ఈ టెక్నో ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ 15W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP కెమెరాను అమర్చారు. వీటితోపాటు వెనుక వైపు LED ఫ్లాట్ లైట్ ఉంది.
ప్రత్యేక ఫీచర్లు :
ఈ టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్ఫోన్ మరిన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ Ella AI సపోర్టును కలిగి ఉంది. ఈ ఫీచర్ హిందీ, తమిళం, బెంగాళీ, మరాఠీ, గుజరాతీ భాషలను సపోర్టు చేస్తుంది.
డ్రాప్ రెసిస్టెంట్ :
ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెంట్ గా ఉంది. అంటే సుమారు 1.6 మీటర్ల ఎత్తు నుంచి కిందపడినా ఫోన్ డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుందని చెబుతోంది. దీంతోపాటు నెట్వర్క్ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనెక్టివిటీని అందించేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
IR బ్లాస్టర్ :
కనెక్టివిటీ పరంగా 4G LTE, WiFi, బ్లూటూత్, GPS, IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. మెరుగైన ఆడియో సపోర్టు కోసం సింగిల్ స్పీకర్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. డిజైన్, కలర్ వేరియంట్స్ పరంగానూ ఈ హ్యాండ్సెట్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.




































