టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది.


తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజు శాంసన్ (6) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చి ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఇదే సమయంలో మూడో వికెట్ 48 బంతుల్లోనే 122 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 37 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. అతనికి శివమ్ దూబె 36(నాటౌట్) అండగా నిలిచాడు. ఇక కివీస్ టీమ్‌లో సాంట్నర్ (47), రవీంద్ర (44) రాణించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.