అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో రీ అడ్మిషన్లు – వీరికి మాత్రమే ఛాన్స్

హైదరాబాద్ లోని అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్శిటీ నుంచి కీలక ప్రకటన విడుదలైంది. పాత విద్యార్థులకు రీ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించారు.


పలువురు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా… ఆ తర్వాత పరీక్షలకు హాజరు కాలేదు. దీంతో వారి కోర్సు కాలపరిమితి కూడా పూర్తి అయింది. అయితే పాత విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన యూనివర్శిటీ అధికారులు…. రీ అడ్మిషన్లపై ప్రకటన చేశారు.

కోర్సు పూర్తి చేయలేని పాత విద్యార్థులు… వారు కోర్సు పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ డా.వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నిర్ణయంలో భాగంగా…. విద్యాసంవత్సరం 1986 నుంచి 2013 వరకు డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ) బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పెషల్‌ రీఅడ్మిషన్‌ పొందడానికి ప్రత్యేక అవకాశం ఉంటుంది.

మరిన్ని వివరాలకు కాల్‌ సెంటర్‌ 18005990101 లేదా హెల్ప్‌ డెస్క్‌ 040-23680222 నంబర్లను సంప్రదించవచ్చు. జూబ్లీహిల్స్‌లోని యూనివర్శిటీలోని ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.