డబ్లూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది. ఈ సంస్థతో తమ 78 సంవత్సరాల అనుబంధం, కట్టుబాట్ల నుంచి పక్కకు తొలుగుతున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఏడాది క్రితమే ప్రకటించారు.

ఇప్పుడు అమెరికా అధికారికంగా ఈ నిర్ణయాన్ని అమలులో పె ట్టింది. ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగడం అనేది అధ్యక్షుడిగా తాను తీసుకున్న అతి దారుణ నిర్ణయం అని ట్రంప్ చెప్పారు. సంస్థ నుంచి వైదొలి గే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఇంతవరకు సంస్థ స క్రమ రీతిలోపనిచేయలేదని స్పందించారు. కొవిడ్ మహమ్మారి నియంత్రణ, ప్రపంచ వ్యాప్త ఆరోగ్య సంస్కరణల అమలులో డబ్లుహెచ్‌ఒ విఫలం అయింది. ప్రపంచదేశాలలో దాదాపుగా ప్రతి ఒక్క దేశం డబ్లుహెచ్‌ఒలో సభ్య దేశంగా ఉంది. ఆరోగ్యం చికిత్సల విషయాలలో పేదదేశాలకు ఎప్పటికప్పుడు ఈ సంస్థ ద్వారా సేవలు అందుతాయి. పైగా తలెత్తే పలు రకాల అంటువ్యాధులు, వైరస్‌ల విషయంలో ముందస్తు జాగ్రత్తలను వెలువరించే బాద్యత కూడా ఈ సంస్థ తీసుకుంటుంది.


అయితే సంస్థ నుంచి వైదొలిగే సమయానికి సంస్థకు అమెరికా నుంచి 260 మిలియన్ డాలర్ల నిధుల బకాయిలు చెల్లించాలి. దీని విలువ రూపాయలలో 2382 కోట్లు వరకూ ఉంటుంది. అమెరికా తనకు తానుగా నిర్ణయం తీసుకుంటే సరిపోదని, ముందుగా బకాయిలు చెల్లించాల్సిందేనని, లేకపోతే అధికారికంగా సంస్థలో అమెరికా ఉన్నట్లే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వాదనను అమెరికా అధికారికంగా తోసిపుచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.