ఒక్కొక్కరికీ రూ.90,000 వడ్డీ లేని రుణాలు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెడుతున్నా.. వాటిలో కొన్ని తమకు చేరట్లేదని ప్రజలు అంటున్నారు. అంటే.. పై స్థాయిలో పథకాలు అమలవుతున్నా..


క్షేత్ర స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో అమలు సరిగా ఉండట్లేదని అర్థం. ఎక్కడ లోపాలు ఉంటున్నాయో గమనించి, సరిచేసుకుంటే మంచిదే. సాధారణంగా సచివాలయ ఉద్యోగులు తమ వరకూ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నారు. ఐతే.. వారికి వర్క్ లోడ్ బాగా పెరుగుతోంది. పైగా ఇప్పుడు ప్రభుత్వం.. వారి అటెండెన్స్ విషయంలోనూ కఠినంగా ఉంటోంది. వారు హెవీ వర్క్‌తో ఇబ్బంది పడుతున్నారు. కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్న కొద్దీ వారిపై భారం పెరుగుతోంది. ఇటీవల ఏకీకృత కుటుంబ సర్వే.. సచివాలయ ఉద్యోగులకు భారంగా మారింది. అది ఇంకా అవ్వలేదు. ఇంతలోనే ఇతర అనేక పనులు వారిపై పడుతున్నాయి. అందువల్ల వారు.. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రుణాల సంగతేంటో చూద్దాం.

ఏపీలో వీధి వ్యాపారులు ఎక్కువే. వారికి రుణాలతో అవసరం ఉంటుంది. కొద్ది పాటి రుణం లభిస్తే, వారు తమ వ్యాపారాల్ని విస్తరించుకోగలరు. కానీ అలాంటి వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు డౌట్ పడుతూ ఉంటాయి. తనాఖాలు పెట్టమంటాయి. తనఖాలు పెట్టేంత ఆస్తులే ఉంటే.. వారు చిన్న చిన్న వ్యాపారాలు ఎందుకు చేస్తారు. అందువల్ల వారు తమకు రుణం ఎలా వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. వారి కోసం కోంద్రం పీఎం స్వ నిధి పథకం తెచ్చింది. కానీ దాన్ని ఏపీలో అమలు చెయ్యాలంటే.. ప్రభుత్వ చొరవ కావాలి. ఇప్పుడు అది మొదలైంది. ఏపీ సర్కారు.. మెప్మా (MEPMA)తో కలిసి.. ఈ పథకాన్ని అమలు చెయ్యడం మొదలుపెట్టింది. దీని ద్వారా ఇకపై వడ్డీ వ్యాపారుల రుణం కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారులే వారికి క్రెడిట్ కార్డులు ఇచ్చి.. వాటి ద్వారా రుణాలు ఇస్తున్నారు.

మెప్మా అధికారుల నుంచి క్రెడిట్ కార్డ్ పొందిన తర్వాత దానిపై రూ.10,000 నుంచి రూ.30,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఆ రుణాలు తీర్చడం ద్వారా తిరిగి రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలను మూడు విడతల్లో ఇస్తుంటారు. మొదటి విడతలో 15,000 వరకూ రుణం తీసుకుంటే.. దాన్ని తీర్చేస్తే, రెండో విడతలో రూ.25,000 రుణం తీసుకోవచ్చు. అది కూడా తీర్చేస్తే ఈసారి.. మూడో విడతలో రూ.50,000 వరకూ రుణం తీసుకోవచ్చు.

ఈ రుణాలపై వడ్డీ కేవలం 7శాతమే ఉంటుంది. బ్యాంకుల్లో దాదాపు 20 శాతం దాకా వడ్డీ ఉంటుంది. కాబట్టి.. తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయని అనుకోవచ్చు. ఇక్కడ మరో బెనెఫిట్ కూడా ఉంది. రుణం తీసుకునేవారు.. 20 నుంచి 50 రోజుల్లో తిరిగి చెల్లించేస్తే, రుణంపై వడ్డీ కూడా ఉండదు. అంతేకాదు.. మరో బెనెఫిట్ కూడా ఉంది. క్రెడిట్ కార్డును ఉపయోగించి.. డిజిటల్ లావాదేవీలు జరిపితే.. వారు నెలకు రూ.120 దాకా క్యాష్ బ్యాక్ పొందే వీలు ఉంది. ఇలా ఈ రుణాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఒక సమస్య: ప్రస్తుతం తిరుపతి జిల్లాలో మాత్రమే ఈ రుణాలు ఇస్తున్నారు. అక్కడ 7,020 మంది ఈ కార్డులు తీసుకునేందుకు అర్హత సాధించారు. వారంతా త్వరలోనే కార్డులు తీసుకొని.. రుణాలు పొందుతారు. ఈ నెలలో అది పూర్తవ్వవచ్చు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. అందువల్ల ఫిబ్రవరి నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల వీధి వ్యాపారులు అలర్ట్‌గా ఉంటూ.. ప్రభుత్వం ప్రకటన ఇవ్వగానే.. రుణాలు తీసుకునేలా ప్లాన్ చెయ్యవచ్చు. మెప్మా అధికారులను కలిసి.. అప్‌డేట్ తెలుసుకోవచ్చు. న్యూస్18తెలుగు కూడా దీనిపై ఓ కన్నేసి ఉంచి.. రాష్ట్రవ్యాప్త ప్రకటన రాగానే ఆ వివరాలు మీకు అందిస్తుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.