మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా సెలెక్ట్ చేయాలి?

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్ ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్ ఖర్చులు పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు.


ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే పెద్ద బ్రాండ్లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేయక తప్పని పరిస్థితి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేముందు ఏ అంశాలు గమనించాలి? రేంజ్, బ్యాటరీ లైఫ్, వారెంటీ, మోడల్, స్మార్ట్ ఫీచర్స్… వీటిని సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి? డీటెయిల్డ్‌గా తెలుసుకోండి.

రేంజ్ ఎంత?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారి మొదటి ప్రశ్న రేంజ్ ఎంత వస్తుంది అని. రేంజ్ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు మళ్లీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదని అర్థం. సాధారణంగా వీటి రేంజ్ 50 కిలోమీటర్ల నుంచి ప్రారంభం అవుతుంది. కొన్ని టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 300 కిలోమీటర్ల రేంజ్ కూడా ఇస్తున్నాయి. రేంజ్ ఎక్కువ ఉంటే ఛార్జింగ్ ప్రతీ రోజూ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రోజూ ఎక్కువ జర్నీ చేసేవారైతే రేంజ్ 80 నుంచి 120 కిలోమీటర్లు ఉండేలా చూసుకోండి. అయితే కంపెనీ చెప్పే రేంజ్ కన్నా 15 నుంచి 30 శాతం రేంజ్ తక్కువగానే క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ట్రాఫిక్, లోడ్, మీరు వెహికిల్ నడిపే ప్రాంతాన్ని బట్టి రేంజ్ మారిపోతుంది.

బ్యాటరీ ఎలా ఉండాలి?

బ్యాటరీ విషయానికి వస్తే లిథియం, గ్రాఫీన్ బ్యాటరీస్ ఉంటాయి. వీటిలో లిథియం బ్యాటరీ ధర ఎక్కువ ఉంటుంది. ఏ బ్యాటరీ లైఫ్ అయినా కనీసం 3 ఏళ్లు ఉంటుంది. అందుకే కంపెనీలు 3 ఏళ్ల వారెంటీ ఇస్తాయి. ఇక బ్యాటరీ ఛార్జింగ్ టైమ్ ఎంత పడుతుంది అనేది కూడా చూడాలి. వీలైనంతవరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది తీసుకుంటే మంచిది. ఇలాంటి బ్యాటరీ అయితే 4-5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. లేకపోతే రాత్రంతా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ వారెంటీ కనీసం మూడేళ్లైనా ఉండాలి. రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించి ఆరా తీయాలి. అలాగే ఛార్జింగ్ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలి. ఇంట్లో మీరు ఎలాగు ఫుల్ ఛార్జ్ చేస్తారు. కానీ కాస్త దూర ప్రాంతాలకు వెళ్తే ఛార్జింగ్ నెట్వర్క్ ఉందా? లేకపోతే థర్డ్ పార్టీ ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాలా? అనే విషయం తెలుసుకోవాలి.

స్పీడ్ ఎంత?

రేంజ్‌తో పాటు స్పీడ్ కూడా ముఖ్యమే. తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు గంటకు 30-40 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందిస్తాయి. ఎక్కువ స్పీడ్ కావాలంటే కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. అయితే మీరు హైదరాబాద్‌లాంటి ట్రాఫిక్ ఏరియాల్లో నడపాలంటే తక్కువ స్పీడ్ ఉన్న టూవీలర్ సరిపోతుంది. ఒకవేళ మీరు రహదారులపై తిరగాలంటే మాత్రం స్పీడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ స్పీడ్ కూడా వెహికిల్‌లో మీరు సెలెక్ట్ చేసే మోడ్‌ని బట్టి మారుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇకో, నార్మల్, స్పోర్ట్ లాంటి పేర్లతో రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ మోడ్స్ పవర్ వినియోగం, స్పీడ్‌పై ప్రభావం చూపిస్తాయి.

సేఫ్టీ ఫీచర్స్

ఏ వాహనం కొన్నా సేఫ్టీ ముఖ్యం. ట్యూబ్‌లెస్ టైర్లనే ప్రిఫర్ చేయండి. జనవరి 1 నుంచి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా తప్పనిసరి అయింది. కాబట్టి వాహనాలకు ఈ ఫీచర్ ఎలాగూ వస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటే అదనపు భద్రత వస్తుంది. చాలా కంపెనీలు స్మార్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. యాప్ కనెక్టివిటీ, రైడ్ అనలిటిక్స్, యాక్టీవ్ రైడర్ సేఫ్టీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ అండ్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఫాల్ లేదా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS అలర్ట్స్, పార్క్ అసిస్ట్‌తో రివర్స్ మోడ్, GPS లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, స్మార్ట్ కీలెస్ ఇగ్నిషన్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. అయితే ఇవన్ని ఫీచర్స్ అన్ని స్కూటర్లలో లభించవు. పేర్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ ఫీచర్స్ పనితీరేంటో తెలుసుకోవాలి.

ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫైనల్ ధరను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మినహాయించే చెబుతున్నాయి కంపెనీలు. పీఎం ఇ-డ్రైవ్ లాంటి పథకాల ద్వారా ఈ సబ్సిడీ వస్తుంది. అయితే మీకు చెప్పిన ధరలో సబ్సిడీ ఎంత? మీరు చెల్లించాల్సింది ఎంత? అనే వివరాలు తెలుసుకోవాలి. మీరు చెల్లిస్తున్న ధరకు మీకు మంచి ఫీచర్స్ లభిస్తున్నాయో లేదో చెక్ చేయాలి. ఒకటే బ్రాండ్, ఒకటే మోడల్ అని ఆలోచించకుండా, వేర్వేరు బ్రాండ్స్‌లో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపేర్ చేసి నిర్ణయం తీసుకోవాలి. మీరు రోజూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారు? సిటీలోనే తిరుగుతారా? ఇతర ప్రాంతాలకు వెళ్తారా? మీ బడ్జెట్ ఎంత? మీకు స్మార్ట్ ఫీచర్స్ అవసరమా? కొన్న తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది? ఇలా అన్ని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎలక్ట్రిక్ స్కూటర్ సెలెక్ట్ చేయండి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.