గుంటూరులోని DMHO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ విధానంలో 45 ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గుంటూరులోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. మొత్తం 45 ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 2వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ – డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, గుంటూరు
- ఖాళీలు – 45
- ఖాళీల వివరాలు : శానిటరీ అటెండెంట్ – 26, ల్యాబ్ టెక్నీషియన్- 8, ఫార్మసిస్ట్ 01, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 3, ఫీమేల్ నర్సింగ్ – 7
- ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, డీ ఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని అనుభవం తప్పనిసరి.
- దరఖాస్తు – ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాలి. https://guntur.ap.gov.in/ వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంటుంది.
- దరఖాస్తు రుసుం – బీసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ. 800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500
- దరఖాస్తు చివరి తేదీ – 2 ఫిబ్రవరి 2026
- అధికారిక వెబ్ సైట్ – https://guntur.ap.gov.in/

































