ఈ విషయం అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఫోన్ పై ఈ చర్చ మొదలయ్యింది. అంతేకాదు, రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ సెట్ మరియు జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ అవుతున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది.
Realme P4 Power: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ ముందగా వెల్లడించింది.
Realme P4 Power: ఫీచర్స్
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ భారీ 10,001 mAh బిగ్అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ తో లాంచ్ అవుతోంది. ఇంత పవర్ ఫుల్ బ్యాటరీతో ఇండియాలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ తో పటు పాటు ఇతర పరికరాలను వేగంగా ఛార్జ్ చేసే 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఇందులో మీడియాటెక్ Dimensity 7400 చి సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ఉంటాయి.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4D డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా జతగా మరో రెండు కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది 4K రిజల్యూషన్ వీడియోలు మరియు సూపర్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.



































