ఫిబ్రవరి 12న సమ్మెలో ఆర్టీసీ కార్మికులు

ఫిబ్రవరి 12న కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.


ఈ మేరకు ఆయా కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. దేశ కార్మికోద్యమ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో మొత్తం ఆర్టీసీ కార్మికులు పాల్గొన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెనకి తీసుకోవాలని, 29 చట్టాల స్థానంలో తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల పరిషారం కోరుతూ ఈ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చారు. ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తి వేయాలని, ఆర్టీసీ పరిరక్షణ, కార్మికోద్యమం పరిరక్షణ, విద్యుత్తు బస్‌ విధానంలో మార్పులు చేసి ఆర్టీసీకే అవకాశం కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఆ సమ్మెలో పాల్గొంటారని సంస్థ ఎండీకి స్టాఫ్‌ అండ్‌ వరర్స్‌ యూనియిన్‌, స్టాఫ్‌ అండ్‌ వరర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీలు సమ్మె నోటీసులు ఇచ్చాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.