అబుదాబీలో సెల్ ఫోన్ డ్రైవింగ్‌.. ఫైన్‌ ఎంతో తెలిస్తే షాక్‌?

ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 3,260 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో ప్రతి ఏడాది లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.


ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను సంపూర్ణంగా పాటించకపోవడమే.

అయితే అరబ్ దేశమైన యూఏఈ రోడ్డుప్రమాదాలను నివారించేందుకు కఠినమైన ట్రాఫిక్ రూల్స్‌ను అమలు చేస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ వాడితే 800 దిర్హామ్‌లు (సుమారు రూ. 18,000 ) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. యూఏఈలో ఒక డ్రైవర్‌కు 24 బ్లాక్ పాయింట్లు వస్తే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయబడుతోంది. అబుదాబీలో రోడ్లపై ఉండే అత్యాధునిక ఏఐ కెమెరాలు డ్రైవర్ ఫోన్ వాడుతున్నా లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా ఫైన్ వేస్తాయి.

అయితే బ్లూటూత్ లేదా హెడ్‌ఫోన్స్ ద్వారా మాట్లాడేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడ్డాక వెళ్తే 1,000 దిర్హామ్‌లు(సుమారు రూ.25,000) ఫైన్‌తో పాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. పరిమితి(80 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో వెళ్తే 3,000 దిర్హామ్‌ల(సుమారు రూ.75,000) జరిమానా పడుతోంది. రోడ్లపై ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. తిరిగి వాహనాన్ని విడిపించుకోవడానికి 50,000 దిర్హామ్‌లు(రూ.12 లక్షలకు పైగా) కట్టాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.