ఇప్పటికీ థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పండుగ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ చిరు కెరీర్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే ఉత్సాహంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహిస్తోంది.
సక్సెస్ మీట్‌కు నయన్!
ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సక్సెస్ మీట్‌కు మూవీ టీం మొత్తం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటే నయనతార కూడా అటెండ్ కాబోతున్నట్లు సమాచారం. మూవీ ప్రమోషన్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే నయన్… ఫస్ట్ టైం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మూవీలో తాను నటించబోతున్నట్లు ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.
అలాగే, మూవీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ అనిల్ దగ్గరకు వెళ్లి ‘ఏంటీ మూవీ ప్రమోషన్స్ చేద్దామా?’… అని నయనతార అడగ్గానే… అనిల్ కళ్లు తిరిగి పడిపోవడం నవ్వులు పూయించింది. ఈ ప్రమోషనల్ వీడియో ట్రెండ్ అయ్యింది. నిజానికి నయన్ ఏదైనా మూవీకి సైన్ చేసే ముందే మేకర్స్‌తో తాను ప్రమోషన్లలో పాల్గొనను అనే కండీషన్‌తోనే చేస్తారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్లుగానే మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె ఎక్కడా కనిపించే వారు కాదు. అయితే, అనిల్ మూవీకి మాత్రం ప్రమోషనల్ వీడియోస్ చేయడంపై అంతా షాకయ్యారు.
ప్రమోషన్లపై ట్రోలింగ్
నయన్ తాను నటించిన తమిళ మూవీస్‌కు ప్రమోషన్స్ చేయకుండా తెలుగు మూవీకి ప్రమోషన్స్ చేయడం ఏంటంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. అయితే, వీటికి డైరెక్టర్ అనిల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి మెగాస్టార్ మూవీతో ఆమె ప్రమోషన్స్ స్టార్ట్ చేశారంటూ కొందరు కామెంట్స్ చేశారు. అటు మెగా ఫ్యాన్స్ చిరు మూవీ అంటే తగ్గేదేలే అంటూ ట్రెండ్ చేశారు.
స్పీచ్ కోసం వెయిటింగ్
సక్సెస్ మీట్లో నయనతార ఏం మాట్లాడతారు? అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రాబోయే మూవీస్‌కు కూడా ఆమె ప్రమోషన్స్ చేస్తారా? లేదా ఈ మూవీకే పరిమితం చేస్తారా? అనేది కూడా క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు. హైదరాబాద్ పార్క్ హయాత్‌లో జరగనున్న సక్సెస్ మీట్లో మూవీ టీంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొననున్నారు.
MSVPG మాసివ్ బుకింగ్స్
ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్లో చేరిన మూవీ అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. శనివారం ఒక్క రోజే 24 గంటల్లో ‘బుక్ మై షో’లో లక్షకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. లాంగ్ వీకెండ్, వరుస సెలవులతో ఇంకా బిగ్ నెంబర్స్ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.450 కోట్ల వరకూ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఉండొచ్చని అంటున్నారు.


































