తెలుగు సినీ లవర్స్ కు క్రేజీ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ సెట్ అయింది. సందీప్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కన్ఫామ్ చేశాడు.
రా అండ్ బోల్డ్ మూవీస్ తో ఎవరేమనుకున్నా పర్లేదని తన స్టైల్లో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి మొదలు యానిమల్ వరకూ డైరెక్టర్ గా అతని రూటే వేరు. మరోవైపు పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన హీరో అల్లు అర్జున్. మరి సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది? అదే జరగబోతుంది.
సందీప్ రెడ్డి-అల్లు అర్జున్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. ఎట్టకేలకు అవి నిజమనే క్లారిటీ వచ్చేసింది. సందీప్ డైరెక్సన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రొడక్షన్ హౌస్ తో సందీప్ రెడ్డి వంగా లైనప్ గురించి చెప్పాడు.
ఆ సినిమాల తర్వాత
ఆ ఇంటర్వ్యూలో భూషణ్ మాట్లాడుతూ సందీప్ రెడ్డి లైనప్ లోని సినిమాల గురించి చెప్పాడు. స్పిరిట్, యానిమల్ పార్క్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉందని భూషణ్ తెలిపాడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ తీస్తున్నాడు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ యానిమల్ కు సీక్వెల్ గా యానిమల్ పార్క్ తెరకెక్కించనున్నాడు. ఇందులో రణ్ బీర్ కపూర్ హీరో. ఈ రెండు మూవీస్ తర్వాత అల్లు అర్జున్ తో సందీప్ సినిమా ఉండనుంది.
ఏఏ24 అదేనా?
పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీస్ తర్వాత ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇదో సూపర్ హీరో తరహా సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఏఏ22 మూవీ
దీని తర్వాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఇది ఏఏ23. మరి దీని తర్వాతనే సందీప్-అల్లు అర్జున్ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే ఏఏ24 అని అంటున్నారు.
ఎలాంటి జోనర్?
సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోయిజం వేరే లెవల్ లో ఉంటుంది. ఎలాంటి లిమిట్స్ లేకుండా హీరోను రా అండ్ రస్టిక్, బోల్డ్ గా చూపిస్తాడు సందీప్. ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. యానిమల్ లో తండ్రి కోసం ఎంతకైనా తెగించే కొడుకుగా రణ్ వీర్ కనిపించాడు. మరి అల్లు అర్జున్ ను సందీప్ ఎలా చూపించబోతున్నాడనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.


































