ఇప్పుడు బంగారం కొనకండి. అమ్మకండి! త్వరలో రాబోతున్న భారీ మార్పు

బంగారం ధరలు తగ్గడం పక్కన పెడితే, తగ్గినట్లే తగ్గి మళ్ళీ రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. జనవరి 24 నాటి లెక్కల ప్రకారం:బంగారం: 22 క్యారెట్ల ఒక గ్రాము ధర ₹14,620 , 8 గ్రాములు ధర ₹1,16,960 . గత రెండు రోజుల్లోనే తులంపై ₹4,160 పెరిగింది.
  • వెండి: కిలో వెండి ధర ఏకంగా ₹10,000 పెరిగి ₹3,55,000 వద్ద విక్రయించబడుతోంది.

ఇప్పుడు కొనాలా? వద్దా?


బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు:

  1. వేచి చూడటం ఉత్తమం: ప్రస్తుతం గ్రాము బంగారం తులం ₹15 వేల దరిదాపుల్లో ఉంది. పన్నులు, మజూరీ అన్నీ కలిపితే గ్రాము ₹17 వేల వరకు పడుతుంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు (ఉదాహరణకు అమెరికా రాజకీయ నిర్ణయాలు) సానుకూలంగా ఉంటే ధర 10% వరకు తగ్గి గ్రాము ₹12,500 కు వచ్చే అవకాశం ఉంది. అలా ధర తగ్గినప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిది.
  2. అవసరం ఉంటేనే కొనండి: ఇంట్లో వివాహాలు లేదా ఇతర శుభకార్యాలు ఉంటే తప్ప, కేవలం లాభం కోసం ఇప్పుడు కొనడం రిస్క్ అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  3. దీర్ఘకాలిక పెట్టుబడి: మీరు ఒకసారి కొని 5 నుండి 10 ఏళ్ల వరకు మర్చిపోతాము అనుకుంటే మాత్రం ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే 2026 చివరి నాటికి తులం బంగారం ₹1.75 లక్షల నుండి ₹2 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా.

వద్దని ఎందుకు అంటున్నారు?

బంగారం ధర ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లాగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతోంది. ధర ఏ దిశలో వెళ్తుందో స్పష్టత లేదు. అందుకే ప్రస్తుతానికి మార్కెట్‌ను గమనిస్తూ ఉండటమే మేలని నిపుణుల సలహా.

అమ్మే ఆలోచన ఉందా?

మీ దగ్గర ఉన్న బంగారాన్ని లాభం కోసం ఇప్పుడే అమ్మేయకండి. ఈ ఏడాది చివరి నాటికి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప బంగారాన్ని విక్రయించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో సామాన్యులు బంగారం కొనడం అసాధ్యంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి, ఉన్న బంగారాన్ని భద్రంగా ఉంచుకోవడమే శ్రేయస్కరం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.