పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్త..? బడ్జెట్‌లో కీలక ప్రకటన

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో ఏమేమీ ఉంటాయనే దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.

ట్యాక్స్ మినహాయింపుల్లో సామాన్య, మధ్యతరగతికి ఉపయోగపడేలా ఏం ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఇక పెన్షనర్లకు సంబంధించి ఎలా నిర్ణయాలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. అదేంటంటే.. రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ కనీస పరిమితిని పెంచనుందని సమాచారం. బడ్జెట్‌లో ఈ ప్రకటన ఉండవచ్చని చెబుతున్నారు.


పెన్షన్ పెంపు

ప్రస్తుతం ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెలనెలా రూ.వెయ్యి వరకు కనీస పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఈ పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు లేదు. ద్రవ్యోల్బణం, దేశంలోని ఆర్ధిక పరిస్థితులను బట్టి ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈపీఎఫ్‌వో పెన్షన్ లిమిట్‌ను పెంచాలని ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో రూ.వెయ్యి కనీస పెన్షన్ ఎందుకు సరిపోవడం లేదని వాపోతున్నారు. ఉద్యోగి సంఘాలు ఎప్పటినుంచో దీనిని పెంచాలని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. జనవరి 6వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రితో భారతీయ మజ్దూర్ సంఘ్ సభ్యులు సమావేశమయ్యారు. ఈపీఎఫ్‌వో సభ్యులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే కనీస పెన్షన్‌ను పెంచాలని ప్రతిపాదన పెట్టారు. ఇతర ఉద్యోగి సంస్థు కూడా కనీస పెన్షన్‌ను రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశాయి.

సుప్రీంకోర్టులో కేసు

ఇప్పటికే ఈపీఎఫ్‌వో సబ్‌స్కైబర్లకు కనీస పెన్షన్‌ను 11 ఏళ్లుగా పెంచకపోవడంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. పెన్షన్ పెంపుపై కేంద్రం తన నిర్ణయం తెలిపాలని ఇటీవల సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై బడ్జెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌పై బడ్జెట్‌లో ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు.

ఫెసిలిటేషన్ అసిస్టెంట్ల నియామకం

ఈపీఎఫ్‌లో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం… త్వరలో ఫెసిలిషన్ అసిస్టెంట్లను నియమించేందుకు సిద్దమవుతోంది. వీళ్లు నాయమాత్రమే రుసుములు తీసుకుని పెన్షన్‌దారులకు సహాయం అందిస్తారు. సీనియర్ సిటిజన్లు పదే పదే కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వీళ్లు సహాయం అందిస్తారు. ఇలా బడ్జెట్‌లో ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే పలు ప్రకటనలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి బడ్జెట్‌లో కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటనలు ఏవేం ఉంటాయనేది చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.