అగరుబత్తుల పొగ వెనుక ఉన్న భయంకరమైన నిజం

అగరుబత్తులు మన ఇళ్లలో మరియు దేవాలయాలలో పూజ కోసం వాడే ముఖ్యమైన వస్తువు. అయితే, దీని నుండి వచ్చే సువాసన భరితమైన పొగ, చాలా మందిలో శ్వాసకోశ మరియు నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుందని మీకు తెలుసా?


ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:

  1. కణాలలో విషపూరితం: అగరుబత్తులు వెలిగించినప్పుడు అవి గాలిని కలుషితం చేయడమే కాకుండా, శరీరానికి హాని చేసే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి కణాలలో విషపూరిత స్వభావాన్ని పెంచి, జన్యుపరమైన మార్పులకు కారణమవుతాయి.
  2. శ్వాసకోశ సమస్యలు: ఈ పొగ పీల్చడం వల్ల చాలా మందిలో దగ్గు, ఆయాసం వస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, అగరుబత్తుల పొగ సిగరెట్ పొగ అంతగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది.
  3. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ పొగ నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లి చికాకును కలిగిస్తుంది, ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
  4. ఆస్తమా: గాలి కాలుష్యం మరియు పొగ వల్ల ఊపిరితిత్తుల కణాలలో వాపు ఏర్పడుతుంది, ఇది ఆస్తమా వచ్చే అవకాశాలను పెంచుతుంది.
  5. చర్మ సమస్యలు: ఈ పొగలోని రసాయనాలు చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి, చర్మంపై దద్దుర్లు లేదా అలర్జీలను కలిగిస్తాయి.
  6. పిల్లలపై ప్రభావం: గర్భిణీ స్త్రీలు అగరుబత్తుల పొగకు దూరంగా ఉండటం మంచిది. ఇది పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపి, వారిలో ‘ల్యుకేమియా’ (రక్త క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
  7. నరాల రుగ్మతలు: ఈ పొగ వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు వంటి సమస్యలు రావచ్చు.
  8. తలనొప్పి: తక్కువ మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ పీల్చినా తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం వంటివి సంభవిస్తాయి.
  9. గుండె జబ్బులు: నిరంతరం ఈ పొగను పీల్చే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 12% ఎక్కువగా ఉంటుందని, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 19% ఉంటుందని అంచనా.

ముఖ్య సూచన: అగరుబత్తులకు బదులుగా సహజసిద్ధమైన సాంబ్రాణిని వాడటం ఆరోగ్యానికి మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.