ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం లభిస్తుంది.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బీటెక్, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్‌కి అలర్ట్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), తాజాగా కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది.


ఈ సంస్థ పరిధిలోని ‘స్పేస్ అప్లికేషన్స్ సెంటర్’ (SAC).. రీసెంట్‌గా సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’, ‘SD’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ME/MTech గ్రాడ్యుయేట్లు వీటికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు 2026 ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2 లక్షల వరకు జీతం లభిస్తుంది.

స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) అనేది ఇస్రోకు చెందిన ప్రీమియం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్స్‌లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. ఈ సంస్థ అంతరిక్షంలోకి తీసుకెళ్లే పరికరాలను రూపొందించడంతో పాటు కమ్యూనికేషన్, నావిగేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ శాస్త్రం, గ్రహాల మిషన్ల కోసం స్పేస్ టెక్నాలజీలను డెవలప్ చేస్తుంది.

రిక్రూట్‌మెంట్ వివరాలు
ఇస్రో SAC 2026 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీవే. వీటిలో సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’- 45 పోస్టులు; సైంటిస్ట్/ఇంజనీర్ ‘SD’- 4 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ 2026 జనవరి 13న ప్రారంభం కాగా, అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

భారీగా జీతాల పెంపు, బకాయిల మొత్తం? ఎవరెవరికి ఎంత డబ్బు వస్తుందంటే..

విద్యార్హతలు
అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ME/MTech పూర్తి చేసి ఉండాలి. కనీసం 60% మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌లో 6.5 CGPA/CPI సాధించి ఉండాలి.

సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (మైక్రో ఎలక్ట్రానిక్స్/VLSI/ఎంబెడెడ్ సిస్టమ్స్): VLSI డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా సెమీకండక్టర్ టెక్నాలజీస్ లో స్పెషలైజేషన్ ఉండాలి.

సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): RF ఇంజనీరింగ్, మైక్రోవేవ్, రాడార్, ఎలక్ట్రానిక్స్ లేదా అనుబంధ విభాగాల్లో స్పెషలైజేషన్ ఉండాలి.

సెలక్షన్ ప్రాసెస్
సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ ఉద్యోగాలకు.. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. సైంటిస్ట్/ఇంజనీర్ ‘SD’ పోస్టులకు.. అభ్యర్థుల అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

జీత భత్యాలు
సైంటిస్ట్/ఇంజనీర్ ‘SD’ పోస్టులకు పే మ్యాట్రిక్స్‌లో లెవల్-11 వర్తిస్తుంది. అంటే నెలకు రూ. 67,100 నుంచి రూ. 2,08,700 వరకు జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేసి, SAC రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోకి వెళ్లాలి.

ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత, సంబంధిత పోస్టును (SC లేదా SD) ఎంచుకోవాలి.

తర్వాత కనిపించే అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.