15 ఏళ్లలోపు ‘బ్యాన్‌’

చిన్నారులు సోషల్‌మీడియా వాడకుండా నిషేధంఫ్రాన్స్‌ దిగువసభలోబిల్లుకు ఆమోదముద్రపారిస్‌: సామాజిక మాధ్యమాల సుడిగుండంలో పడి విద్యారోగ్యాలను పాడుచేసుకుంటున్న చిన్నారులను కాపాడే లక్ష్యంతో ఫ్రాన్స్‌ ముందడుగువేసింది.


15 ఏళ్లలోపు చిన్నారుల సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్‌ చట్టసభ సభ్యులు సంబంధిత బిల్లుకు ఆమోదముద్ర వేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ దిగువసభలో జరిగిన ఓటింగ్‌లో 130-21 మెజారిటీతో బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు.

సెప్టెంబర్‌లో మొదలయ్యే నూతన విద్యాసంవత్సరం నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తేనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఎగువసభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. వచ్చే కొద్దివారాల్లో దీనిని సెనేట్‌లోనూ ఆమోదింపజేసుకుంటామని మేక్రాన్‌ ధీమా వ్యక్తంచేశారు. బిల్లు దిగువసభలో ఆమోదంపొందడంతో మేక్రాన్‌ సంతోషం వ్యక్తంచేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.