అండమాన్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్లాన్ ఇది.
మరికొన్ని రోజుల్లో ఎక్కిడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? కొంతకాలం బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసకోవాలనుకంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఐఆర్సీటీసీ అందించే అమేజింగ్ టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకోండి. ఐఆర్సీటీసీ సూపర్ డూపర్ ప్యాకేజీలోని అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి అండమాన్‌కు టూర్ ఆపరేట్ చేస్తోంది. అమేజింగ్ అండమాన్ టూర్ పేరుతో మార్చి 30వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో అనేక ప్రాంతాలను చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు. ఆరు రోజులు, ఐదు రాత్రులు వెళ్లి రావొచ్చు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం), హవ్లాక్, నెయిలీ చుట్టేసి రావొచ్చు.
డే 1
ఉదయం 06:25కి హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం) విమానాశ్రయానికి ఉదయం 08:55కి చేరుకుంటారు. హోటల్‌కు చెక్ ఇన్ అవుతారు. భోజనం చేస్తారు. సెల్యులార్ జైలు, మ్యూజియం సందర్శిస్తారు. ఆ తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌ను సందర్శించండి. తరువాత లైట్ అండ్ సౌండ్ షో కోసం సెల్యులార్ జైలుకు వెళ్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
డే 2
శ్రీ విజయ పురం నుండి స్వరాజ్ ద్వీప్ (హావ్లాక్) వరకు క్రూయిజ్ సమయాల ప్రకారం వెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. భోజనం చేస్తారు. రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హావ్లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
డే 3
హావ్‌లాక్‌లో హోటల్లో అల్పాహారం చేస్తారు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వెళ్తారు. హావ్లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
డే 4
అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. కాలా పత్తర్ బీచ్‌కు వెళ్తారు. తరువాత క్రూయిజ్ సమయాల ప్రకారం నెయిల్ ద్వీపానికి బయలుదేరుతారు. హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌ను సందర్శిస్తారు. నెయిల్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
డే 5
అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. భరత్‌నగర్ బీచ్‌ను సందర్శిస్తారు. తరువాత క్రూయిజ్ సమయాల ప్రకారం పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరుతారు. హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
డే 6
హోటల్లో అల్పాహారం చేస్తారు. తెల్లవారుజామున చెక్ అవుట్ చేసి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో వెళ్లి హైదరాబాద్ కు విమానం ఎక్కాలి. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు
టూర్ ధర సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.65850గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ. 48700 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే ఒక్కొక్కరికి రూ. 46950 పడుతుంది. చైల్డ్ విత్ బెడ్ అయితే రూ. 40450 చెల్లించాలి. చైల్డ్ విత్ ఔట్ బెడ్ అయితే రూ. 37000గా ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.






























