నథింగ్ ఫోన్ 3 తర్వాత టెక్ మార్కెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏదైనా ఉందంటే.. అది Nothing Phone 4a సిరీస్ గురించే.
2025లో ట్రెండ్ సెట్ చేసినా నథింగ్ ఫోన్ ఈసారి కూడా తన a సిరీస్‌లో భాగంగా 4a, 4a Pro అనే రెండు మోడల్స్‌ను విడుదల చేయనుంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర, లాంచ్ డేట్ గురించి కొన్ని లీక్స్ వెలువడ్డాయి.
ఎప్పడు లాంచ్ కావొచ్చు?
ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మార్చి 2న బార్సిలోనాలో జరిగే MWC 2026 ఈవెంట్‌లో Nothing Phone 4a Proని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ లాంచ్‌తో పాటే భారత్‌లో కూడా ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు టెక్ నిపుణులు.
6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే:
డిస్‌ప్లే విషయంలో ఈ సారి నథింగ్ ఏకంగా 6.82 అంగుళాల భారీ AMOLED స్క్రీన్‌ను ఇస్తున్నట్టు సమాచారం. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇది రానుంది. దీంతో ఎంత ఎండలో అయినా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్‌కు చెందిన పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 12GB RAM, 256GB స్టోరేజ్ కాంబినేషన్‌తో రానుందట.
ఛార్జింగ్ టెన్షన్ ఉండదు:
ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత Nothing OS 4.0తో పని చేస్తుంది. ఒక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,080 mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని సమాచారం. తద్వారా ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడమే కాకుండా.. రోజంతా కంటిన్యూగా వాడుకోవచ్చు.
అబ్బుర పరిచేలా కెమెరా సెటప్:
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ రాబోతోందని సమాచారం. 50MP మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫొటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరానే ఇవ్వబోతున్నారట. వీడియో కాల్స్ లేదా వ్లాగింగ్ చేసేవారికి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్.
ధర ఎంత ఉండొచ్చు?
నథింగ్ ఫోన్ 4a ప్రో భారత మార్కెట్లో దాదాపు రూ. 35వేల లోపు ఉండవచ్చని అంచనా. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న లీకులు, రూమర్లు మాత్రమే. వాస్తవానికి ఈ ఫోన్ లుక్ ఎలా ఉంటుంది, ధర ఎంత అనేది తెలియాలంటే కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు మనం వేచి చూడాల్సిందే.

































