భారత్‌లో తొలి భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ఏకంగా 10,001mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా సహా

రియల్‌మి నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 10001mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి P4 పవర్ 5G ఇవాళ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది.

ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 39 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రాన్స్‌వ్యూ డిజైన్‌ను కలిగి ఉంది. 4D కర్వ్‌+, 50MP కెమెరాల సహా అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. భారత్‌లో తొలి భారీ బ్యాటరీ ఫోన్‌గా నిలవనుంది.


రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్‌+ హైపర్‌గ్లో డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 1.07 బిలియన్‌ కలర్స్‌, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :

రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP సోనీ కెమెరా :

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ఉంది. ఈ కెమెరాలతో 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఏకంగా 10001mAh బ్యాటరీ :

ఈ స్మార్ట్‌ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,001mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 27W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 932.6 గంటల స్టాండ్‌బై టైంను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ హైపర్‌విజన్‌+ AI చిప్‌ను కూడా కలిగి ఉంది. ఫలితంగా 90fps BGMI ను సపోర్టు చేస్తుందని రియల్‌మి చెబుతోంది. ఈ ఫోన్‌ 4613 Sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆర్మర్‌షెల్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :

ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఫిబ్రవరి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ట్రాన్స్‌బ్లూ, ట్రాన్స్‌ ఆరెంజ్‌, ట్రాన్స్‌సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.