ఇండియాలోనే 200 కోట్లు దాటిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి లెటేస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్.

ఈ సూపర్ హిట్ మూవీ ఇండియాలోనే రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి చిరంజీవి పాడిన పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

సంక్రాంతి 2026 విన్నర్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ, కలెక్షన్లలో దూకుడు కొనసాగిస్తోంది. జనవరి 12, 2026న రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలోనే రూ.200.69 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

మొత్తం వసూళ్లు

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రపంచవ్యాప్తంగానూ అదరగొడుతోంది. ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లోనూ మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు 4.5 మిలియన్ డాలర్లు దాటాయని కూడా ఈ సినిమా నిర్మాతలు అనౌన్స్ చేశారు.

పెద్దిరెడ్డి సాంగ్

మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూడటానికి వెళ్లిన వాళ్లకు పెద్దిరెడ్డి సాంగ్ తో చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి సర్ ప్రైజ్ చేశారు. మామను టీజ్ చేసేలా సాగే ఈ పాటను స్వయంగా చిరంజీవి పాడటం విశేషం. తాజాగా ఈ పెద్దిరెడ్డి వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

మన శంకర వరప్రసాద్ గారు గురించి

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సూపర్ హిట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన రీజినల్ సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచిందని నిర్మాతలు ప్రకటించేశారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ తదితరులు నటించారు. దీనికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తారు. కేంద్రమంత్రి రక్షణ బాధ్యతలు చూసుకుంటారు. తనకు దూరమైన భార్య, పిల్లలను తిరిగి కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.