బడ్జెట్ ధరలో ఫిబ్రవరి మొదటి వారంలో వస్తుంది

Samsung Galaxy A07 5G ఒక బడ్జెట్ సెగ్మెంట్ 5G స్మార్ట్‌ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి సరిపోయే మంచి స్పెక్స్ మరియు ఫీచర్స్ తో రూపుదిద్దుకుంది.


ఇది మాత్రమే కాదు మంచి డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.

Samsung Galaxy A07 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎ07 5జి ఫోన్‌ లో 6.7 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది HD+ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ లో బ్రౌజింగ్, వీడియోలు మరియు గేమింగ్‌ ను కూడా చాలా స్మూత్‌ ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G ప్రాసెసర్ తో వస్తుంది. డైలీ టాస్కింగ్, మరియు సోషల్ మీడియా యాప్స్ తో పాటు లైట్ గేమింగ్ కోసం ఈ ప్రొసెసర్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ Android 16 ఆధారంగా One UI 8 తో వస్తుంది.

ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా మరియు 2MP సెల్ఫీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెక్ఫై కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఇది 1080 పిక్సెల్ వీడియోలు మరియు గొప్ప Ai కెమెరా సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh పవర్ ఫుల్ అండ్ బిగ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కంపెనీ ఈ ఫోన్ లో అందించింది.

అంతేకాదు, ఈ అప్ కమింగ్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రెండు సరికొత్త కలర్స్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా శాంసంగ్ అనౌన్స్ చేసింది.

Samsung Galaxy A07 5G: లాంచ్ డేట్?

శాంసంగ్ గెలాక్సీ ఎ07 5జి స్మార్ట్ ఫోన్ కచ్చితమైన లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ఫిబ్రవరి రెండో వారం ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను మంచి బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉందని కూడా కంపెనీ ఊరిస్తోంది. మరి ఈ ఫోన్ ను కంపెనీ ఎటువంటి ధరలో అందిస్తుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.