తమిళనాడు స్టేట్‌ సినీ అవార్డ్స్‌లో ‘సూర్య’ రికార్డ్‌

మిళనాడు ప్రభుత్వం 2016 నుండి 2022 సంవత్సరాలకు సంబంధించి తాజాగా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. సినిమాలే కాకుండా.. 2014 నుండి 2022 వరకు రాష్ట్ర టెలివిజన్ అవార్డులలో భాగంగా కళాకారులను సత్కరించింది.


ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు, కార్తీ, పార్థిబన్ వంటి స్టార్స్‌ వారి చిత్రాలకు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. నయనతార, కీర్తి సురేష్, జ్యోతిక, అపర్ణ బాలమురళి, లిజోమోల్ జోస్, సాయి పల్లవి 2016-2022 సంవత్సరాలకు ఉత్తమ హీరోయిన్స్‌గా ఎంపికయ్యారు. సూర్య నటించిన జై భీమ్‌, ఆకాశం నీ హద్దురా చిత్రాలు ఏకంగా 13 ఆవార్డ్స్‌ను దక్కించుకుని రికార్డ్స్‌ క్రియేట్‌ చేశాయి. 2021 ఉత్తమ చిత్రంగా జైభీమ్‌ ఎంపికతో పాటు దర్శకుడు, నటి,విలన్‌, సహాయ నటుడు, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వంటి విభాగాల్లో సత్తా చాటింది. అయితే, ఆకాశం నీ హద్దురా సినిమాకు గాను సూర్యకు ఉత్తమ నటుడి అవార్డ్‌ దక్కింది. ఫిబ్రవరి 13న అవార్డ్స్‌ కార్యక్రమం జరగనుంది.

2016 విజేతలు

ఉత్తమ చిత్రం : మానగరం

మహిళా సాధికారత విభాగంలో ఉత్తమ చిత్రం: అరువి

ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (పురియత పుతిర్)

ఉత్తమ నటి: కీర్తి సురేష్

ఉత్తమ దర్శకుడు: లోకేష్ కనగరాజ్ (మానగరం)

ఉత్తమ నటి (ప్రత్యేక బహుమతి): అదితి బాలన్ (అరువి)

ఉత్తమ విలన్: రెహమాన్

ఉత్తమ హాస్య నటుడు: రోబో శంకర్ (మరణానంతరం)

2017 విజేతలు:

ఉత్తమ చిత్రం : అరమ్ (కర్తవ్యం)

ఉత్తమ చిత్రం (ప్రత్యేక బహుమతి): టు లెట్

ఉత్తమ నటుడు: కార్తీ

ఉత్తమ నటి: నయనతార అరమ్ (కర్తవ్యం)

ఉత్తమ దర్శకుడు: పుష్కర్-గాయత్రి (విక్రమ్ వేద)

2018 విజేతలు:

ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్

ఉత్తమ నటుడు: ధనుష్ (వడ చెన్నై)

ఉత్తమ నటి: జ్యోతిక

ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (పరియేరుమ్ పెరుమాల్)

ఉత్తమ నటుడు (ప్రత్యేక బహుమతి): విష్ణు విశాల్ (రాక్షసన్‌)

ఉత్తమ నటి (ప్రత్యేక బహుమతి): ఐశ్వర్య రాజేష్ (కనా/వడ చెన్నై)

ఉత్తమ విలన్: సముద్రఖని (వడ చెన్నై)

ఉత్తమ సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ (వడ చెన్నై)

2019 విజేతలు:

ఉత్తమ చిత్రం : అసురన్

ఉత్తమ నటుడు: ఆర్ పార్థిబన్

ఉత్తమ నటి: మంజు వారియర్ (అసురన్)

ఉత్తమ నటుడు (ప్రత్యేక బహుమతి): కార్తీ (ఖైదీ)

ఉత్తమ విలన్: అర్జున్ దాస్ (ఖైదీ)

ఉత్తమ హాస్య నటి: కోవై సరళ (కాంచన-3)

ఉత్తమ సహాయ నటుడు: ప్రకాష్ రాజ్ (అసురన్)

ఉత్తమ దర్శకుడు: ఆర్ పార్థిబన్

2020 విజేతలు:

ఉత్తమ చిత్రం : కూజంగల్

ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీ హద్దురా)

ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి (ఆకాశం నీ హద్దురా)

ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (ఆకాశం నీ హద్దురా)

2021 విజేతలు:

ఉత్తమ చిత్రం : జై భీమ్

ఉత్తమ నటుడు: ఆర్య (సర్పట్ట పరంబరై)

ఉత్తమ నటి: లిజోమోల్ జోస్ (జై భీమ్)

ఉత్తమ విలన్: తమిజ్‌ (జై భీమ్)

ఉత్తమ సహాయ నటుడు: కె మణికందన్ (జై భీమ్)

ఉత్తమ దర్శకుడు: జ్ఞానవేల్ (జై భీమ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: సీన్ రోల్డాన్ (జై భీమ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు): అరివు (జై భీమ్)

2022 విజేతలు:

ఉత్తమ చిత్రం : గార్గి

ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు (తానక్కరన్)

ఉత్తమ నటి: సాయి పల్లవి (గార్గి)

ఉత్తమ విలన్: ప్రకాష్ రాజ్ (విరుమాన్)

ఉత్తమ హాస్య నటుడు: రోబో శంకర్ (మరణానంతరం)

ఉత్తమ హాస్య నటి: ఇంద్రజ శంకర్ (విరుమాన్)

ఉత్తమ దర్శకుడు: గౌతం రామచంద్రన్ (గార్గి)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.