భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన IRCTC.. ఆ పుణ్యక్షేత్రాలన్నీ ఒకే ప్యాకేజీలో..

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం, బిజీ లైఫ్ కారణంగా చాలా మంది పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్యాప్ దొరికితే చాలా ఏదో ఓ చోటుకి వెళ్లి హాయిగా గడిపేస్తున్నారు.


వీకెండ్ టూరిజం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు కొంతమంది వెళ్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆధ్యాత్మిక యాత్రలు చేపడుతున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టేస్తున్నారు. అయితే అలాంటి వారికోసమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా అయోధ్య నుంచి జగన్నాథ్ పూరి వరకు ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ఉంటుంది. మొత్తం 9 రోజులు, 10 రాత్రులపాటు సాగే ఈ యాత్రలో గయ, వారణాసి, గంగాసాగర్ తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

ఇటీవలికాలంలో టూరిజంపై ప్రజలకు ఆసక్తి పెరిగిన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తక్కువ ఖర్చుతో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC). ఈ మేరకు బడ్జెట్ ధరలోనే అయోధ్య నుంచి జగన్నాథ్ పూరి వరకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బడ్జెట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా గయ, పూరి జగన్నాథ్ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోల్‌ కతా, గంగాసాగర్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది.

ఈ టూర్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అంటే ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 14 న ముగుస్తుంది. ఈ పుణ్యక్షేత్ర టూర్ ఆగ్రాలోని కాంట్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ టూర్ లో భాగంగా మొత్తం 767 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అందులో సెకండ్ ఏసీకి 49 సీట్లు, థర్డ్ ఏసీకి 70 సీట్లు, అలాగే స్లీపర్ క్లాస్ కు 648 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం అందిస్తారు.

ఇక ప్యాకేజీ టికెట్ ధరల విషయానికి వస్తే.. స్లీపర్ ఎకానమీ అయితే పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 19, 110 గా ఉంది. అలాగే పిల్లలకు అయితే రూ. 17,950 గా ఉంది. ఇక థర్డ్ ఏసీ అయితే పెద్దలకు రూ. 31, 720 అలాగే పిల్లలకు రూ.30,360 గా నిర్ణయించారు. సెకండ్ ఏసీ కంఫర్డ్ క్లాస్ పెద్దలకు రూ. 41, 980 ఉంది ఇక పిల్లలకు అయితే రూ.40,350 గా ఉంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు www.irctctourism.com సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.