చాలామంది మహిళలు ఈ సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే టెన్యూర్ ఉంటుంది. ఈ పెట్టుబడులపై అధిక వడ్డీ లభిస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి ఇందులో మహిళలు పొందవచ్చు.
ఇక ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ది యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు బాలిక పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు పొదుపు చేయవచ్చు. ఆడబిడ్డ 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఇందులో చేసే సేవింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఏకంగా 8.2 శాతం వడ్డీ అందిస్తోంది.
అంతేకాకుండా సుకన్య సమృద్ది యోజన పథకంలో పెట్టుబడి పెడితే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 80సీ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపులు కూడా పొందోచ్చు. పిల్లల ఉన్నత చదువులు, వివాహం కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి ఇది మంచి పథకం. తల్లిదండ్రులకు ఇదొక వరంగా చెప్పవచ్చు.
ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కాలపరిమితి కేవలం ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. మినిమం రూ.వెయ్యి నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక దీంతో పాటు మహిళలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ ఆదాయం పొందవచ్చు.


































