గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే తాజాగా శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు లీక్ అయ్యాయి.
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ ఆధారంగా అల్ట్రా వేరియంట్ వివరాలు లీక్ అయ్యాయి. గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ S25 అల్ట్రా తో పోలిస్తే చిన్న చిన్న మార్పులతోనే S26 అల్ట్రా మోడల్ (Samsung Galaxy S26 Ultra Smartphone)లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే శాంసంగ్ మాత్రమే అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.
డిస్ప్లే, బ్యాటరీ అంచనా వివరాలు :
తాజాగా వచ్చిన లీక్స్ ఆధారంగా గెలాక్సీ A26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల QHD+ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెబుతున్నారు. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చిప్సెట్ వివరాలు :
ఈ హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్సెట్తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తే అవకాశం ఉంది. ఈ ఫోన్ 256GB ప్రారంభ స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ కానుందో వెల్లడి కావాల్సి ఉంది.
200MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయని సమాచారం. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ S Pen ను సపోర్టు చేస్తుంది. ప్రస్తుత లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ మెరుగైన కెమెరాలు, పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. 214 గ్రాముల బరువుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కోబాల్ట్ వైలెట్, బ్లా, వైట్, సిల్వర్ షాడో, స్కై బ్లూ, కోబాల్ట్ వైలెట్, పింక్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2026 లో విడుదల కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 25 వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే లాంచ్ పైన శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే లాంచ్ అనంతరం ఈ సిరీస్ ను ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 మధ్య ముందస్తు బుకింగ్ ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. తొలి సేల్ మార్చి 11 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

































