Peach Candy:పీచు మిఠాయిపై ‘బ్యాన్’.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు

తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిని నిషేధిస్తూ అధికారులు బాంబు పేల్చారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని నిపుణులు కోరుతున్నారు. పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని..
ఇది క్యాన్సర్ కు కారణమని ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ కాటన్ క్యాండీల తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. పుదుచ్చేరీలో కూడా పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. పిల్లల కోసం వీటిని కొనడం మానుకోవాలని ప్రజలను కోరారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

పీచు మిఠాయిలో రోడమైన్-బి వంటి ప్రమాదకరమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల నిషేధం ఏర్పడింది. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఆరాధించే ఈ మిఠాయి సింథటిక్ డైతో కలుషితమైంది.. అందుకే ఇకపై మీరు కూడా తినడం తినిపించడం మానేయండి.