Panchamukha hanuman: పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

www.mannamweb.com


Panchamukha hanuman: భూత, ప్రేత, పిశాచి భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది పూజిస్తారు. ఏవైనా పీడ కలలు, దెయ్యాలు కలలోకి వచ్చాయంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠిస్తారు.
అంజనేయుడి పంచముఖాలు కలిగిన ఫోటో మీ ఇంట్లోని పూజ గదిలో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది.

గ్రహదోషాల నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ ఆంజనేయస్వామి ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. పంచముఖ ఆంజనేయ స్వామి శక్తివంతమైన దేవుడుగా నమ్ముతారు.

ఈ ఫోటో ఉండటం వల్ల ప్రయోజనాలు

మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఇంటిని దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు. ఇంట్లోకి ఎటువంటి ఆత్మలు ప్రవేశించే సాహసం చేయలేవు. ధైర్యం, బలాన్ని అందించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడని పూజిస్తారు. ఈ ఫోటో మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు ధైర్యం, శక్తి లభిస్తుంది. అనేక భయాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది.

పంచముఖ ఆంజనేయస్వామి పూజించడం వల్ల మీ ఇంట శ్రేయస్సు, సంపద ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధించేందుకు మీకు ఆ ఆంజనేయుడు అండగా నిలుస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగాను బలపడతారు. అలాగే హనుమంతుడు ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు శ్రీరామనామ జపం చేయాలి.

ఆంజనేయ స్వామి పంచముఖాల ప్రాధాన్యత ‘

తూర్పు ముఖం హనుమంతుడిగా భావిస్తారు. పాపాలను హరింప చేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది. దక్షిణాభి ముఖం నరసింహ స్వామి అవతారం. శత్రు భయాన్ని తొలగిస్తుంది. అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది.
పడమరగా ఉండే ముఖం గరుడ స్వామి అని పిలుస్తారు. శరీరాన్ని ఎటువంటి చెడు శక్తులు ఆవహించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉత్తర ముఖం లక్ష్మీ వరాహమూర్తిగా చెప్తారు. నవగ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాలను తప్పిస్తుంది. మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తుంది.

ఉత్తముఖం హయగ్రీవ స్వామి పరిగణిస్తారు. జ్ఞానం, విజయం, మంచి జీవిత భాగస్వామిని, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు. వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారువైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారు.

ఎలాంటి ఫోటో పెట్టుకోవాలి

పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మీ కష్టాలన్నీ తీరిపోతాయి. తుంగభద్రా నది తీరంలో స్వామి కోసం తపస్సు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడుగా దర్శనం ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలని అనుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

ఫొటో స్పష్టంగా ఉండాలి. పూజ గదిలో దాన్ని సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఫోటోలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫోటోలో స్వామి ముఖం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతంగా ఉన్నది ఉంచుకోవాలి.

ఆంజనేయుని మంగళవారం నాడు పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ప్రతిరోజు పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. మంగళవారం, శనివారం స్వామివారికి తమలపాకు, వెన్న సమర్పించి పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.