Business Idea: తక్కువ పెట్టుబడి భారీగా ఆదాయం.. ఈ బిజినెస్‌ స్టార్ట్ చేస్తే మీకు తిరుగుండదు

www.mannamweb.com


ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటిలా ఉద్యోగం చేశాక వ్యాపారం చేద్దామనుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ, చదువు పూర్తికాగానే వ్యాపారం చేద్దామనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిద్దామా ఆసక్తి ఎక్కువుతోంది. ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ముందుకుసాగుతున్నారు. అయితే మీరు కూడా వ్యాపారం చేద్దామని ఆలోచనలో ఉన్నారా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే మంచి వ్యాపారం ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్లో చిప్స్‌కు భారీగా డిమాండ్‌ ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చిప్స్‌ను ఎంతో ఇష్టపడి తింటున్నారు. కొన్ని బహుళ జాతి కంపెనీలు ప్రకటనలకే కోట్లలో ఖర్చు పెడుతున్నాయి అంటేనే చిప్స్‌ వ్యాపారం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం లోకల్‌ బ్రాండ్‌ పేరుతో ఆలు చిప్స్‌ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాన్ని ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పొటాటో చిప్స్‌ తయారీకి ముందుగా ఒక మిషన్‌ అవసరం పడుతుంది. చిప్స్‌ తయారీ ఆధారంగా ఈ మిషన్‌ ధర ఆధారపడింది. మార్కెట్లో మ్యానువల్‌గా (చేతులతో) చిప్స్‌ తయారు చేసే మిషన్‌ ధర రూ. 1000 నుంచే అందుబాటులో ఉంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువ చిప్స్‌ తయారు చేయాలంటే ఆటోమేటిక్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతుంది. దీంతో అలుగడ్డల తొక్కలను తీసి మిషిన్‌లో వేస్తే చాలు మీరు కోరుకున్న విధంగా చిప్స్‌ బయటకు వస్తాయి.

ఇక చిప్స్‌ తయారీకి ప్రత్యేంగా స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. కరెంటర్‌ కూడా పెద్దగా ఖర్చవదు. ఇక చిప్స్‌లో కలిపే మసాలా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మసాలతోనే చిప్స్‌కు రుచి వస్తుంది. ఆ తర్వాత ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి చిప్స్‌ను విక్రయించుకోవచ్చు. ఇందుకోసం ప్యాకింగ్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే చిన్న చిన్న దుకాణాలకు నేరుగా వెళ్లి మీ ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్కెట్‌ చేసుకున్న ఆధారంగా నెలకు తక్కువలో తక్కువగా రూ. 30 వేల వరకు సంపాదించొచ్చు.