సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ06 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఆగస్టు 22వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.
ఫీచర్ల విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌లో వాల్యూమ్ రాకర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ మన కరెన్సీలో రూ. 12వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనుగోలు చేస్తే 25 వాట్స్ ఛార్జర్‌ను ఉచితంగా పొందొచ్చు.