టాలీవుడ్ లో పెను విషాదం… రవితేజ విలన్ కన్నుమూత.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ విలన్ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు ముకుల్ దేవ్ కాసేపటి క్రితం మృతి చెందాడు.


54 సంవత్సరాల ముకుల్ దేవ్… గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో.. కాసేపటి క్రితమే మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ముకుల్ దేవ్… టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా అతనికి మంచి క్రేజ్ ఉంది. రవితేజ నటించిన కృష్ణ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడి అలాగే అదుర్స్ లాంటి సినిమాల్లో కనిపించాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.