సంపాదించిన డబ్బు నిలవాలని మనలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరికి డబ్బు అస్సలు నిలవదు. సంపాదించిన సొమ్ము, సంపాదించినట్లు ఖర్చవుతుంది. నీళ్ల మాదిరిగా ఖర్చవుతుంటుంది.
అయితే ఇలా డబ్బు వృధాగా పోవడానికి వాస్తు దోషాలు కూడా కారణమవుతాయని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే వాస్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు ఆర్థికపరమైన నష్టాలకు దారి తీస్తాయి. ఇంతకీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమయ్యే వాస్తు దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇంట్లో నైరుతి దిశకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నైరుతి దిక్కు సంపదకు, స్థిరత్వానికి ప్రతీక. అందుకే నైరుతి దిశ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నైరుతిలో చెత్తవేయడం ఏమాత్రం చేయకూడదు. ఈ దిక్కును నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఇంట్లో ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి ఈ దిశ విషయంలో చాలా జాగ్రత్తపడాలి.
* ఇక ఈశాన్యం దిశకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ దిక్కును దేవుడి స్థానంగా భావిస్తారు. కాబట్టి ఈశాన్యం మూల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ దిశలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్యం మూలలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో నీటి ఫౌంటెన్ ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు.
* వంటింటి కూడా ఇంట్లో ప్రాముఖ్యత ఉంటుందని తెలిసిందే. అయితే వంటింటికి సంబంధించి వాస్తును తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. వంటిల్లు ఆగ్నేయ దిశలో ఉండాలని చెబుతున్నారు. ఆగ్నేయంలో వంట చేయడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. డబ్బు కూడా సమకూరుతుంది.
* వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే నీటి కుళాయిలో లీకేజ్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది దీనిని సాధారణ సమస్యగా భావిస్తారు. అయితే దీనివల్ల ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవు. డబ్బు వృధాగా ఖర్చవుతుంది. వీటితో పాటు ఇంట్లో విరిగిన వస్తువులను, పనిచేయని వస్తువులు ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.