Hydలో బయటపడ్డ రూ.7,000 కోట్ల భారీ స్కాం..20 వేల మంది బాధితులు

www.mannamweb.com


దేశంలో ఈ మధ్య మాయమాటలు చెప్పి ఎదుటివారిని క్షణాల్లో బురిడీ కొట్టించే కేటుగాళ్ళ సంఖ్య ఎక్కువైంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలనే కోరికతో ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. మీరు పెట్టిన పెట్టుబడికి రెండితలు వస్తుందని, 10 నుంచి 12 శాతం వడ్డీ ఇస్తారన్న ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయిస్తున్నారు. తీరా తాము మోసపోయామని తెలిసిన బాధితులు లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ తరహా మోసాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి గుట్టు చప్పుటు లేకుండా ఉడాయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. బాధితుల్లో మార్పు రావడం లేదు. డబ్బు ఆశతో పెట్టుబడులు పెట్టడం.. తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం సర్వసాధారణం అయ్యింది. హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. రూ.7 వేల కోట్ల స్కాం కు పాల్పపడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీడి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధిక లాభాల ఆశ చూపించి కంపెనీ తమను ఘోరంగా మోసం చేసిందని బాధితులతు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులకు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డీపీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. కేవలం హైదరాబాద్ లోనే 20 వేల మంది డిబి స్టార్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. హైదరాబాద్‌తో పాటు, కోల్‌కొతా, ముంబై, ఢిల్లీ, గౌహతి, నల్పరి, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో కేసులు నమోదు అయ్యాయి.

స్కామ్ బయటపడిందిలా..

హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ సెప్టెంబర్ 23న పోలీసులను ఆశ్రయించాడు. అసోం రాష్ట్రం గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్‌కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో డీబీ బ్రోకింగ్ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2018 లో డిబి స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది. వీటిలో 120 శాతం వడ్డీని అందించే వారికి ప్లాన్, 54 శాతం అందించే వారికి సెమీ – వార్షిక ప్లాన్, 7 శాతం అందించే వారికి నెలవారి ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి.జులై 2024 నుంచి చెల్లింపులు ఆగిపోయినట్లు పెట్టుబడిదారులు వాపోయారు.