బుధవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో కంభం పట్టణానికి చెందిన భార్యాభర్తలు ఉద్యోగాలు సాధించారు. ఓరుగంటి హేమ చంద్ర, అతని భార్య ఉమ్మడి వినత సత్తాచాటారు.
వినత 238 మార్కులు సాధించి మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం పొందారు. ఆమె భర్త హేమచంద్ర 221 మార్కులు సాధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరికి మూడు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తారు. వీరితో పాటు కంభం పట్టణానికి చెందిన డి.రంగయశ్వంత్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, స్పందన డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

































