ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో రూ. 15 వేలు, స్పెషాలిటీ ఏంటంటే..

www.mannamweb.com


మీకు తెలిసి ఒక కేజీ రైస్‌ ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఒక రూ. 70 ఉంటుంది. బాస్మతి లాంటివి అయితే ఓ రూ. 100 ఉంటుంది అంటారా.? అయితే కేజీ బియ్యం ధర ఏకంగా రూ.

15000 ఉంటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కిలో బియ్యం ధర అక్షరాల రూ. 15,000 పలుకుతోంది. ఇంతకీ ఏంటా బియ్యం.? అందులో ఉన్న అంత ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా చెప్పుకునే ఈ బియ్యాన్ని జపాన్‌ దేశంలో పండిస్తారు. ఈ రైస్‌ పేరు కిన్నీ. సాధారణంగా మనం ఉపయోగించే బియ్యాన్ని వండే ముందు నీటితో కడుగుతుంటాం. అయితే ఈ కిన్మీరైస్‌ బియ్యాన్ని మాత్రం కడగాల్సిన అవసరం లేదు. నేరుగా వండుకోవచ్చు. ఈ బియ్యాన్ని టోయో రైస్ కార్పొరేషన్ అనే సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీని 1961లో స్థాపించారు. కేవలం ఒక్క సంస్థ మాత్రమే వీటిని తయారు చేయడం కూడా వీటి ప్రాముఖ్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు.

ఈ జపనీస్ కిన్మీ రైస్ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బియ్యంగా పిలుస్తుంటారు. బియ్యం ఉత్పత్తిలో అధునాతన సాంకేతిక ఉపయోగించడం, రుచికరమైన బియ్యాన్ని తయారు చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. సాధారణ బియ్యంతో పోల్చితే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ వేరియంట్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ రైస్‌ వేగంగా జీర్ణమవుతుంది. ఈ రైస్‌లో సాధారణ బియ్యంతో 1.8 రెట్లు ఎక్కువ ఫైబర్‌, ఏడు రెట్లు ఎక్కువ విటమిన్‌ బీ1 లభిస్తుంది.

అలాగే ఈ రైస్‌లో ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్ ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్, డిమెన్షియా వంటి సమస్యలను దరిచేరకుండా చేయడంలో ఉపయోగపడతాయి. ఇదిగో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ రైస్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా పేరు గాంచింది.