ఎంత బీపీ అయినా కంట్రోల్ చేసే ఆకు కూర.. డాక్షర్లే షాక్..

www.mannamweb.com


ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. వారంలో కనీసం ఒక్కసారైనా ఆకు కూరలు తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆకు కూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి.

బచ్చలి కూరను ఇంట్లో కూడా ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. ఈ ఆకుకూరలో ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, కే, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి.

బచ్చలి కూర తినేందుకు ఎవరూ ఇష్ట పడరు. బచ్చలి కూర తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిసి వైద్యులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పలు అధ్యయనాల్లో కూడా హై బీపీని కంట్రోల్ చేయడంలో బచ్చలి కూర చక్కగా పని చేసిందని తేలింది.

అధిక రక్త పోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు బచ్చలి కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. హైబీపీ పేషెంట్లు రెగ్యులర్‌గా బచ్చలి కూర తీసుకుంటే రక్త పోటు అనేది కంట్రోల్ అవుతుంది. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కూడా ఈ ఆకు కూర చక్కగా పని చేస్తుంది.

అంతే కాకుండా బచ్చలి కూర తింటే చర్మ సమస్యలు, ఎముకలు బలంగా మారడం, రక్త హీనత సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఫైల్స్, ఊబకాయం, అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )