బంగారం ధరలు మరింత పెరుగుతాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఇలా ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని జ్యుయలరీ దుకాణాల యజమానులే చెబుతున్నారు. బంగారం, వెండి వస్తువులు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. కానీ శక్తికి మించి కొనుగోలు చేయడం మాత్రం అందరికీ కష్టమే అవుతుంది. అందుకే ధరలు తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయాలని అందరూ భావిస్తారు. కానీ ధరలు తగ్గడం అన్నది అరుదుగానే జరుగుతుంది. ధరలు తగ్గినా పది గ్రాముల బంగారం పై పది రూపాయలు మాత్రమే తగ్గుతుంది. అంతకు మించి ఊరట పసిడిప్రియుులకు లభించదు.
వేచి చూసినా…
ధరలు పెరిగినప్పుడల్లా ఆశ్చర్య పడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. బంగారం, వెండి వస్తువులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాగా భావిస్తారు. అలాంటి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి గతంలో పోటీ పడే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. బంగారం విషయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనుకుని వేచి చూసినా చాలా రోజుల నుంచి ధరలు దిగి రాకపోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పెట్టుబడులు పెట్టేవారు సయితం బంగారం ధరలు భారీగా పెరగడంతో భారీగా పతనమయ్యే అవకాశముందని భయపడి కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
స్వల్పంగా తగ్గినా…
ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం మూఢమి కాలం నడుస్తుంది. ఈ సమయంలో బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ ఉండదు. కొనుగోళ్లు కూడా భారీగా తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,040 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,860 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,95,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు.































